/rtv/media/media_files/2025/11/04/zohran-2025-11-04-06-59-16.jpg)
Zohran Mamdani
న్యూయార్క్(new-york) కొత్త మేయర్.. డెమోక్రాట్ పార్టీకి చెందిన జోహ్రాన్మామ్దానీ. ఇతను భారత మూలాలు ఉన్న వ్యక్తి. ప్రఖ్యాత దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు. హిందీ బాగా మాట్లాడతారు. ఒడియా కూడా మాట్లాడగలరు. మంచి వక్త అని చెబుతున్నారు. జోహ్రాన్ దాదాపు 49 శాతం ఓట్ల మెజార్టీతో న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో గెలిచారు. విజయం తర్వాత మామ్దానీ చేసిన మొట్టమొదటి ప్రసంగంలో భారత మొదటి ప్రధాని నెహ్రూ చేసిన 'ట్రైస్ట్ విత్ డెస్టినీ' ప్రసంగాన్ని ఉటంకించారు. జోహ్రాన్ ఈ ఎన్నికల్లో జోహ్రాన్.. రిపబ్లికన్ కర్టిస్స్లివా, స్వతంత్ర ఆండ్రూ క్యూమోలను ఓడించారు. దీంతో పాటూ న్యూయార్క్ కు ఎన్నికైన మొదటి ముస్లిం, ఏషియన్ మేయర్ గా కూడా మామ్దానీ చరిత్ర సృష్టించారు. అదొక్కటే కాదు అతి చిన్న వయసు మేయర్ గా కూడా ఈయన రికార్డ్ సాధించారు.
#BreakingNews 🇺🇸
— Sameer Kaushal 🇨🇦❤🇮🇳 (@itssamonline) November 5, 2025
NYC Mayor-Elect Zohran Mamdani @ZohranKMamdani mentioned Jawahar Lal Nehru's words (1st Indian🇮🇳 Prime Minister) in his victory speech.#USPoli#India#Zohran#JawaharlalNehrupic.twitter.com/OMWXrKBmAs
Also Read : ట్రంప్ కు చుక్కలు చూపెట్టిన భారత సంతతి..మూడు చోట్ల గెలుపు
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం..
న్యూయార్క్ ఎన్నికల్లో జోహ్రాన్మామ్దానీ గెలుపులో ఆయన చేసిన ఎన్నికల వాగ్దానాలు మేజర్ రోల్పోషించాయనే చెప్పాలి. వాటిల్లో ఒకటి మహిళలకు ఫ్రీ బస్(free-bus). తాను ఎన్నికయితే అద్దెలను తగ్గిస్తానని, పిల్లల సంరక్షణను, మెట్రో బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని సౌకర్యం కల్పిస్తానని, నగరంలో ప్రభుత్వమే నిర్వహించే కూరగాయల దుకాణాలని ఏర్పాటు చేస్తానని వాగ్ధానం చేశాడు. వీటిల్లో మెట్రో బస్సులో ఉచిత ప్రయాణం ఇప్పుడు భారత్ లో అందరినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే తెలంగాణలో గత రెండేళ్ళుగా, ఆంధ్రప్రదేశ్ లో ఏడాదిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తున్నాయి ప్రభుత్వాలు కర్ణాటకలో కూడా ఈ స్కీమ్ అమల్లో ఉంది. ఇప్పుడు ఇదే స్కీమ్ ను జోహ్రాన్ కూడా అనౌన్స్ చేయడంతో.. తెలుగు రాష్ట్రాలను కాపీ కొట్టారని మాట్లాడుకుంటున్నారు. ఏదైతేనేం మన ప్రభుత్వాల పథకాలు విదేశాల్లో వారిని కూడా ఆకర్షిస్తున్నాయని చెప్పుకుంటున్నారు.
Also Read: Indian Origin: ట్రంప్ కు చుక్కలు చూపెట్టిన భారత సంతతి..మూడు చోట్ల గెలుపు
Follow Us