/rtv/media/media_files/2025/12/30/fotojet-48-2025-12-30-07-59-50.jpg)
Former Prime Minister of Bangladesh passes away!
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని(ex-prime-minister), బీఎన్పీ చీఫ్ ఖలీదా జియా (80) ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజూమున ఆమె తుదిశ్వాస విడిచినట్లు బీఎన్పీ ప్రకటించింది. ఖలీదా జియా గతకొంత కాలంగా వయోభారంతో పాటు సిర్రోసిస్, ఆర్థరైటిస్, డయాబెటిస్, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని బీఎస్‌పీ తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఈ ఏడాది నవంబర్ 23న ఆమెను ఢాకాలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చేర్పించారు.
Also Read : ‘జన నాయగన్’ ఈవెంట్ రికార్డు..
Bangladesh Former PM Passed Away
కాగా ఆసుపత్రిలో ఆమెకు బంగ్లాదేశ్, యూకే, యూఎస్, చైనా, ఆస్ట్రేలియాకు చెందిన వైద్య నిపుణుల బృందం ఆమెకు చికిత్స అందించారు. 36 రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతోన్న ఆమె ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఖలీదా జియా మరణంతో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కాగా ఇటీవలే ఆమె కుమారుడు తరీఖ్ రెహమాన్ 15 ఏండ్ల తర్వాత తల్లిని చూసేందుకు బ్రిటన్ నుంచి బంగ్లాదేశ్ తిరిగొచ్చారు. కాగా వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలు(elections) జరగనుండగా ఆమె మరణించడం బీఎన్‌పీకీ తీవ్ర నష్టమనే చెప్పాలి.
ఖలీదా జియా(Khaleda Zia) మరణించడం ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపించనుంది. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బంగ్లాదేశ్ రాజకీయాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. నోబెల్ అవార్డ్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఎన్నికల్లో బీఎన్పీ విజయం సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ క్రమంలో ఎన్నికలకు ముందే ఖలీదా జియా మరణించడం గమనార్హం.
Also Read : వెటకారంగా పోస్ట్.. తర్వాత సారీ... వీళ్ళ ఆటలింకెన్నాళ్ళు?
Follow Us