Gaza: గాజాలో దారుణ పరిస్థితులు.. ఆహారం కావాలంటే మహిళలు కొరిక తీర్చాల్సిందే

హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ గాజాపై దాడులు చేస్తూనే ఉంది. దీంతో గాజా ప్రజల పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. అక్కడి మహిళలు తమ పిల్లలకు ఆహారం పెట్టేందుకు లైంగిక దోపిడికి గురవుతుండటం కలకలం రేపుతోంది.

New Update
Food in exchange for sex, Gaza women narrate horror as war continues

Food in exchange for sex, Gaza women narrate horror as war continues

హమాస్(hamas) అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌(israel) గాజా(gaza) పై దాడులు చేస్తూనే ఉంది. దీంతో గాజా ప్రజల పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. అక్కడి మహిళలు తమ పిల్లలకు ఆహారం పెట్టేందుకు లైంగిక దోపిడికి గురవుతుండటం కలకలం రేపుతోంది. వీటికి సంబంధించి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  ఇక వివరాల్లోకి వెళ్తే..38 ఏళ్ల ఓ మహిళ తన ఆరుగురు పిల్లలకు ఆహారం పెట్టేందుకు తీవ్ర అవస్థలు పడుతోంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆమెకు ఎయిడ్‌ ఏజెన్సీలో ఉద్యోగం కల్పిస్తానంటూ హామీ ఇచ్చాడు. 

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక.. భారీగా DA పెంపు!

Food In Exchange For Sex

దీనికి బదులుగా అతడు ఆమెను ఖాళీగా ఉన్న ఓ ఇంటికి తీసుకెళ్లి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత 30 డాలర్లకు సమానమైన డబ్బులు ఇచ్చాడు. కానీ ఉద్యోగం మాత్రం ఇప్పించలేదు. ఇలా తనను వాడుకొని మోసం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఆరుగురు మహిళలు తమకు జరిగిన అన్యాయం గురించి వెల్లడించారు. ఆహారం, డబ్బు, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తమల్ని లొంగదీసుకున్నారని వాపోయారు. మరికొందరు పెళ్లిపేరుతో మాయమాటలు చెప్పి మోసం చేశారని తెలిపారు.    

Also Read: ఆ కంపెనీ ఉద్యోగులకు బిగ్ షాక్.. బలవంతంగా రిజైన్.. ఒక్కసారిగా 80 వేల మందిపై వేటు!

గాజా లాంటి దుర్భర పరిస్థితులు ఉన్న ప్రాంతంలో మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం కొత్తేం కాదని మానవతా సాయం అందించే సిబ్బంది, మానవ హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. దీనిపై హ్యూమన్ రైట్స్‌ వాచ్‌ ప్రతినిధి హీథర్‌ బార్ స్పందించారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రజల పరిస్థితి దారుణంగా దిగజారిపోతాయని పేర్కొన్నారు. దీని పర్యవసానాల్లో భాగంగా లైంగి హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు గాజా మహిళలు, బాలికలు తమకు జరిగిన అన్యాయాన్ని, దయనీయ పరిస్థితుల గురించి చెప్పేందుకు తనకు మాటలు రావడం లేదని వాపోయారు. 

Also Read: సొంత ప్రజల పైనే డ్రోన్లతో దాడులు చేస్తున్న పాకిస్థాన్.. భయంతో వణికిపోతున్న ప్రజలు

మరోవైపు సాయం పొందడం కోసం లైంగిక దోపిడీకి గురైన మహిళలకు తాము చికిత్స అందించామని పాలస్తీనా సైకాలజిస్టులు చెప్పారు. వాళ్లలో కొందరు మహిళలకు గర్భం కూడా దాల్చారని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే గాజాలో నెలకొన్న దుర్భర పరిస్థితులు మహిళలకు శాపంగా మారడం కలకలం రేపుతోంది. సాయం చేస్తాననే ఆశ చూపించి మహిళలను లొంగదీసుకోవడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు