Vemulawada Temple : ఎములాడ రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు...

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ లో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో కలకలలాడింది. 

New Update
Raja Rajeshwara Temple Vemulawada

Raja Rajeshwara Temple Vemulawada

Vemulawada Temple : వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు.  తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఏకదశి పండుగతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారు జాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తుల రాకతో కలకలలాడింది. 

Also Read : ఈ ఒక్క రొట్టె తింటే పెళ్లి ఖాయం! నెల్లూరులో రొట్టెల జాతర

 స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొంటున్నారు. క్యూలైన్లు రద్దీగా మారడంతో భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఏకాదశి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also Read : టాయిలెట్‌లో ఉండి వర్చువల్‌ విచారణ.. కోర్టు కీలక ఆదేశం

ఇక ఆషాడం కావడంతో బద్దిపోచమ్మ ఆలయానికి కూడా భక్తులు పెద్ధ ఎత్తున తరలివచ్చారు. ఇదిలా ఉండగా ఆషాఢ మాసం ఎఫెక్ట్ తో నిన్న మొన్నటి వరకు భక్తులు లేక వెలవెలబోయిన రాజన్న ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ నేడు భక్తుల రాకతో సందడిగా మారాయి. వందలాది మంది భక్తులతో ఆలయ పరిసరాలు జనసంద్రంగా మారాయి.

Also Read: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!

Advertisment
Advertisment
తాజా కథనాలు