Sun : తెలంగాణలో భానుడి భగభగలు..ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణశాఖలు హెచ్చరిస్తున్నాయి.