/rtv/media/media_files/2025/11/21/uk-2025-11-21-08-21-09.jpg)
విదేశాల్లో నివసించాలనుకునే వారికి వరుసగా షాక్ లు ఇస్తున్నాయి ప్రపంచ దేశాలు. అమెరికా మొదలుపెట్టింది. దాన్ని మిగతా దేవాలూ ఫాలో అవుతున్నాయి. తమ ఇమ్మిగ్రేషన్ రూల్స్(UK Immigration Rules) ను మార్చేస్తున్నాయి. మొన్న ఇరాన్ భారత్ కు వీసా ఫ్రీ ఎంట్రీని తీసేసింది. నిన్న యూకీ తన ఇమ్మిగ్రేషన్ రూల్ ను మార్చేయడానికి నిర్ణయించుకుంది. యూకే ప్రభుత్వం అంతర్జాతీయ వలసదారుల విధానంలో అత్యంత కీలకమైన, కఠినమైన మార్పును తీసుకురావడానికి సిద్ధమైంది. ఇందులో బాగంగా భారత్ తో సహా యూకేలో స్థిరపడాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్ చెప్పింది. వలసదారులు శాశ్వత నివాస అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఉండే గడువును రెట్టింపు చేస్తూ ప్రతిపాదనను సిద్ధం చేసింది. దీనిని నిన్న యూకే పార్లమెంట్ లో హౌం సెక్రటరీ షబానా హమమూద్ ప్రవేశపెట్టారు. యూకేలో వలసలను తగ్గించడానికే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని హోం సెక్రటరీ షబానా తెలిపారు. వలసదారుల సంఖ్యను అదుపు చేయాలనే ఓటర్ల ఒత్తిడి, రాజకీయ పార్టీల వాగ్దానాల నేపథ్యంలోనే యూకే ప్రభుత్వం ఈ చారిత్రక మార్పును తీసుకొచ్చింది.
Also Read : థాయ్‌లో ఫెర్రీ ప్రమాదం. స్పాట్ లో 100 మంది ..
ఐదేళ్లు కాదు పదేళ్ళు..
యూకే గవర్నమెంట్(UK government) కొత్త తీసుకురానున్న ఎర్న్‌డ్ సెటిల్‌మెంట్ మొడల్ లో భాగంగా ఈ మార్పులు చేయాలని భావిస్తోంది. ఇప్పటి వరకు యూకేలో ఐదేళ్ళ నివాసం ఉంటే చాలు శాశ్వ నివాసం అనుమతి లభించేది. ఇప్పుడు ఆ ఐఎల్ఆర్ విధాన్నాన్ని రద్దు చేసి...గడువును పదేళ్ళకు పెంచాలని డిసైడ్ అయింది. ఈ నిర్ణయం బ్రిటన్‌లో పని చేస్తున్న లక్షలాది మంది భారతీయ నిపుణులపై, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఈ కొత్త ప్రతిపాదన వలసదారులను వారి ఆదాయం, వృత్తి ఆధారంగా వివిధ వర్గాలుగా విభజిస్తుంది. తక్కువ జీతం ఉన్న ఉద్యోగులు ఇక మీదట యూకేలో శాశ్వత నివాసం పొందాలంటే 15 ఏళ్ల సుదీర్ఘ కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులు ఏకంగా 20 ఏళ్ల పాటు నివాస అనుమతి కోసం నిరీక్షించాల్సి ఉంటుంది. దీంతో పాటూ సాధారణ నిపుణులకు ఆటోమేటిక్ గడువు ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు పెరిగే అవకాశం ఉంది.
అయితే గుడ్డిలో మెల్లలా..యూకే ఆర్థిక, ప్రజారోగ్యానికి సంబందించిన కీకల రంగాల్లో పని చేస్తున్న నిపుణులకు మాత్రం ఈ కొత్త రూల్స్ నుంచి మినహాయింపు లభించనుంది. నేషనల్ హెల్త్ సర్వీసెస్ లాంటి కీలక రంగాల్లో పని చేసే నిపుణులు, ఎక్కువ సంపాదన ఉన్న వ్యాపార వేత్తలకు ఈ కొత్త నింబధనలు ఏవీ వర్తించవు. వీరు ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ సమయంలోనే శాశ్వత నివాస అనుమతి పొందే వెసులుబాటు ఉంది.
Also Read: Nikhat Zareen: తెలంగాణ బాక్సర్ నిఖత్ ఖాతాలో మరో స్వర్ణం
Follow Us