/rtv/media/media_files/w942g6gkGLhDzxaenTiz.jpg)
Earthquake In Pakistan
పాకిస్థాన్‌లో ఈ రోజు ఉదయం భూంకపం(Pakistan Earthquake Latest Updates) సంభవించింది. రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది తెల్లవారుజామున 3:54 గంటలకు సంభవించింది, దీనితో ప్రజలు భయంతో ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం పాకిస్తాన్ వాయువ్యంలో, 150 కిలోమీటర్ల లోతులో గుర్తించబడింది. ఈ సంఘటనలో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. పాకిస్థాన్ దేశం భారత,యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో ఉండటం వలన తరచుగా భూకంపాలు(pakistan earthquake 2025) సంభవిస్తూ ఉంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : థాయ్‌లో ఫెర్రీ ప్రమాదం. స్పాట్ లో 100 మంది ..
Also Read : యూకేలో స్థిరపడాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్.. పదేళ్ళు ఉంటేనే గానీ..
Follow Us