Delhi Blast: సిరియన్ హ్యాండ్లర్, టర్కీ సమావేశాలు, టెలీగ్రామ్ ట్యూటోరియల్స్..ఢిల్లీ బాంబు బ్లాస్ట్ పక్కా స్కెచ్

15మంది ప్రాణాలు తీసిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ పక్కా స్కెచ్ ప్రకారం జరిగిందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. సిరియన్ హ్యాండర్లు, టర్కీ సమావేశాలు, టెలీగ్రామ్ లో ట్యూటోరియల్స్ తో ఉగ్రవాదులు కట్టుదిట్టంగా ప్లాన్ చేశారని కనుగొన్నారు.

New Update
blast

ఢిల్లీ బాంబు దాడి(delhi blast) వెనుక విస్తృతమైన విదేశీ నెట్ వర్క్ ఉందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. 2022 కన్నా ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ, పాకిస్తాన్ హ్యాండ్లర్ ఉకాషా ఆదేశాల మేరకు 2022లో టర్కీ(turkey)లో సిరియన్ ఉగ్రవాదిని మిగతా డాక్టర్లతో కలసినట్టు తెలుస్తోంది. టర్కీ సమావేశం తర్వాతనే ఉమర్ ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యాడని ఎన్ఐఏ చెబుతోంది. ఢిల్లీ బాంబ్ దాడి వెనుక విదేశీ హ్యాండ్లర్లను, రాడికలైజేషన్ మార్గాలను, ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌ను కనుగొంది. ఢిల్లీ బాంబర్ ఉమర్, డాక్టర్ ముజమ్మిల్, డాక్టర్ అదీల్ , డాక్టర్ ముజఫర్ రాథర్‌లతో కలిసి టర్కీ వెళ్ళాడు. అక్కడ సిరియన్ హ్యాండ్లర్లు పెద్ద ఆపరేషన్ లో పాల్గొనాలని వారికి ఆదేశించారని దర్యాప్తులో తేలింది. దీనంతటి వెనకా ఉకాషా అనే హ్యాండ్లర్ ఉన్నాడని చెబుతున్నారు. 

Also Read :  స్కూల్‌లో విద్యార్థినికి 100 గుంజీలు.. మృతి చెందిన బాలిక

టెలీగ్రామ్ ద్వారా బాంబుల తయారీ వీడియోలు..

హ్యాండర్లు టెలీగ్రామ్(telegram) లో 40 కు పైగా బాంబు తయారీ వీడియోలను పంపారని పట్టుబడిన ఉగ్రవాదులు తెలిపారు. ఉమర్ నబీకు బాంబుల తయారీలో శిక్షణనివ్వడానికి ఉగ్ర సంస్థలు పాకిస్థాన్‌ నుంచి బాంబు తయారీ వీడియోలు పంపినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. హంజుల్లా అనే జైషే మహమ్మద్‌ హ్యాండ్లర్‌ ఈ వీడియోలను అతడికి పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో జమ్మూ-కాశ్మీర్ లోని నౌగామ్ లో వెలిసిన ఉగ్రవాద పోస్టర్లలో కూడా ఈ హంజుల్లా పేరు కనిపించింది. దీంతో ఇప్పుడు ఢిల్లీ పేలుళ్ల కేసును దర్యాప్తు చేస్తున్న భద్రతా సంస్థలు జైషే హ్యాండ్లర్‌ను వెతుకుతున్నాయి. 

జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్‌కు చెందిన మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ అనే మతాధికారి ద్వారా జైష్ హ్యాండ్లర్ షకీల్‌తో సంబంధాలు పెట్టుకున్నాడని భద్రతా వర్గాలు తెలిపాయి. మౌల్వి మొదట షకీల్‌ను నియమించుకున్నాడు . అతను ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో వైద్యుడిగా పనిచేశాడు.  ఆ తర్వాత షకీల్ విశ్వవిద్యాలయంలోని ఇతర 'సమాన మనస్తత్వం కలిగిన' వైద్యులైన ముజఫర్ అహ్మద్, అదీల్ అహ్మద్ రాథర్, షాహీన్ సయీద్‌లను కలుసుకుని వారిని నియమించుకున్నాడు. వీరితో ఉమర్ నబీ కూడా జాయిన్ అయ్యాడు. పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు షకీల్‌పై ఆరోపణలు ఉన్నాయి. దీని తరువాత పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాద సంస్థ నెలల తరబడి దేశ రాజధానిలో దాడికి ప్రణాళికలు సిద్ధం చేసిందని వర్గాలు తెలిపాయి.ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లోని హై ప్రొఫైల్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ బృందం 200 శక్తివంతమైన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లను (IEDలు) సిద్ధం చేసుకుందని దర్యాప్తులో వెల్లడైంది. వీటన్నింటి గురించి మాట్లాడ్డానికి ఉగ్రవాదులు టెలీగ్రామ్ యాప్ ను వాడుకున్నారు. అందులో కూడా కోడ్ భాషలో సంభాషించుకునే వారు. బిర్యానీ, దావత్ లాంటి వంటకాల పేర్లను ఉపయోగించేవారు. బిర్యానీ అంటే పేలుడు పదార్థం, దావత్ అంటే ఒక సంఘటన అని చెబుతున్నారు. 

Also Read: Karnataka: ఢిల్లీకి క్యూ కట్టిన కన్నడ నేతలు..రసకందాయంలో కర్ణాటక రాజకీయాలు

Advertisment
తాజా కథనాలు