వాటిపై రాహుల్ గాంధీ ఫొటో.. రాజకీయంగా రచ్చ రచ్చ

బిహార్‌లో మహిళలకు పంపిణీ చేసే శానిటరీ ప్యాడ్స్‌పై రాహుల్ గాంధీ ఫొటోలు వేశారు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఐదు లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్స్‌లను మహిళలకు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

New Update
Rahul Gandhi photo

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీల హడావిడీ మొదలైంది. ఆ రాష్ట్ర మహిళల్లో రుతుక్రమం పరిశుభ్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రియదర్శిని ఉడాన్ యోజన కింద ఉచిత శానిటరీ ప్యాడ్ ప్యాకెట్ల పంపిణీని ప్రారంభించింది. బీహార్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న మై బహిన్ సమ్మాన్ యోజన కింద నెలకు రూ.2,500 స్టైఫండ్ హామీకి అనుగుణంగా ఈ డ్రైవ్ చేపట్టింది. ఐదు లక్షలకు పైగా శానిటరీ ప్యాడ్ బాక్స్‌లను మహిళలకు పంపిణీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై ప్రియాంక గాంధీతోపాటు రాహుల్‌ గాంధీ ఫొటోలు ఉన్నాయి. దీంతో రాజకీయ దుమారానికి ఇది తెరలేపింది. మహిళల కోసం ఉద్దేశించిన శానిటరీ ప్యాడ్ ప్యాకెట్లపై రాహుల్ గాంధీ చిత్రం ఎందుకని ప్రత్యర్థి పార్టీలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ పార్టీకి ఏమైందని సీఎం నితీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఇది ఎన్నికల కోసమేనని ఆయన ఆరోపించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు