ట్రంప్ యూ టర్న్.. చైనాతో పాటు ఆ దేశాలతో స్నేహహస్తం

వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి తొందరపాటు లేదని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రతీ దేశాన్ని కూడా కలవాలని, ముఖ్యంగా చైనాతో సఖ్యతతో ఉండాలని అనుకున్నట్లు తెలిపారు. అలాగే మెక్సికో, జపాన్, ఇటలీ దేశాలతో కూడా స్నేహం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి తొందర పడటం లేదని వెల్లడించారు. ఇటీవల ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో సమావేశం నిర్వహించారు. అయితే వాణిజ్య ఉద్రిక్తతల మధ్య, డొనాల్డ్ ట్రంప్ చైనాతో మంచి ఒప్పందం కుదుర్చుకోగలరనే ఇన్‌డైరెక్ట్‌గా తెలిపారు. ట్రంప్ ప్రతీ దేశాన్ని కూడా కలవాలని అనుకున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చూడండి:Florida university: ఫ్లోరిడా వర్సిటీలో మరోసారి పేలిన తుపాకీ.. ఇద్దరు మృతి..!

మెక్సికో నుంచి జపాన్, ఇటలీ, చైనా దేశాన్ని కలవడానికి ట్రంప్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సుంకాల ముప్పును బట్టి చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఈ సుంకాల విషయంలో ఎలాంటి తొందర లేదని, మెరుగైన ఒప్పందం కోసం ప్రతీ దేశంతో స్నేహహస్తంతో ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే చైనా వాణిజ్య యుద్ధానికి భయపడటం లేదని బీజింగ్ ప్రకటించింది.  

ఇది కూడా చూడండి:Cinema: నిన్న డ్రగ్స్...ఇవాళ లైంగిక ఆరోపణలు..మలయాళ నటుడు టామ్ చాకో నిర్వాకం

చైనాపై 245 శాతం సుంకం

డొనాల్డ్ ట్రంప్ చైనాపై 245 శాతం సుంకం విధించింది. అయితే సుంకాలు తగ్గించేందుకు 75 దేశాలు చర్చలు ప్రారంభించాయి. కానీ చైనా ఇంకా ఎలాంటి చర్చలను ప్రారంభించలేదని తెలుస్తోంది. అమెరికా పరిశ్రమ భద్రత, జాతీయ భద్రత కోసం సుంకాలు తప్పకుండా ఉండాలని ట్రంప్ తెలిపారు. 

ఇది కూడా చూడండి:AP: వైఎస్‌ జగన్‌కు ఈడీ భారీ షాక్ - రూ.793 కోట్ల విలువైన ఆస్తుల జప్తు - క్విడ్ ప్రో కో కేసులు రీ స్టార్ట్

Advertisment
తాజా కథనాలు