/rtv/media/media_files/2025/06/19/donald-trump-conter-attack-to-putin-on-israel-iran-war-2025-06-19-12-33-01.jpg)
Donald Trump Conter Attack to Putin on israel-iran war
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య అమెరికా జోక్యం చేసుకోకూడదని రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌కు సైనిక సాయం చేయకూడదని.. లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్‌కు మధ్యవర్తిత్వం వహిస్తానని తెలిపారు. అయితే పుతిన్ వ్యాఖ్యలపై తాజాగా ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. ముందుగా మీ సంగతి చూసుకోవాలంటూ సెటైర్లు వేశారు. జెలెన్‌స్కీతో మధ్యవర్తిత్వం చేసుకోవాలని.. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశిస్తూ ట్రంప్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి గుడ్‌న్యూస్.. మళ్లీ వీసాలు షురూ
Israel-Iran War 2025
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ అణు ముప్పును తాము ఓ వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నామని ఇజ్రాయెల్ సాయుధ దళాలు చెప్పాయి. ఇప్పటికే ఇరాన్‌లోని 1100 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు IDF ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ తెలిపారు.
Also Read: ఇరాన్‌కు అండగా ఏకమైన 21 ఇస్లామిక్ దేశాలు
తాజాగా ఇజ్రాయెల్ పైకి ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్‌లోని ప్రధాని ఆస్పత్రి సోరోఖాపై కూడా బాంబు దాడి జరిగింది. ఈ దాడుల్లో ఆస్పత్రి ధ్వంసమయ్యింది. బాంబులు పడటంతో పేషెంట్లు, డాక్టర్లు బయటకు పరుగులు పెట్టారు. అలాగే శిథిలాల కింద వందలాది మంది పేషెంట్లు చిక్కుకున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
MOST BREAKING 🚨
— Ashish Singh (@AshishSinghKiJi) June 19, 2025
Iran Launched ballistic missile on Soroka Medical Center Hospital on Southern Israel
It's BIGGEST ATTACK ! #IsraelIranConflict#IranUnderAttack#IranIsrael#IranIsraelConflict pic.twitter.com/T0R7rrt0gb
Also Read: బీటెక్ చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
Also Read : ట్విట్టర్ లో ట్రెండవుతున్న కాజల్.. ఈ మ్యాషప్ వీడియోలు చూస్తే ఫిదా!
usa | rtv-news | israel iran war