/rtv/media/media_files/2025/10/06/donald-trump-2025-10-06-14-02-49.jpg)
Donald Trump claims he warned about Osama Bin Laden ‘a year before’ 9/11 attacks
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడులకి ఏడాది ముందే తాను ఒసామా బిన్ లాడెన్(osama-bin-laden) గురించి హెచ్చరించినట్లు పేర్కొన్నారు. అమెరికా నావీ 250 వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం వర్జీనియాలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. '' ఒసామా బిన్‌లాడెన్‌ను తలలో బుల్లెట్ దింపిన SEAL(ఒసామా బిన్ లాడెన్‌పై దాడి చేసిన) బృందాన్ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను కూల్చడానికి ఒక ఏడాది ముందుగానే నేను ఒసామా బిన్ లాడెన్ గురించి రాశాను. అతడితో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించాను. నేను చెప్పింది నిజం కాకపోతే నా మాటలు ఫేక్ అని వార్తలు వచ్చేవి. పీట్ హెక్సాత్‌కు (ప్రస్తుత యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ)కి ఏడాది క్రితమే చెప్పాను.
Also Read: ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది పర్వతారోహకులు
Donald Trump Claims He Warned About Osama Bin Laden
ఓ బుక్‌లో నేను దీని గురించి రాశాను. ఓ పేజీలో ఒసామా బిన్‌లాడెన్ అనే వ్యక్తిని చూశానని రాశాను. అతను నాకు నచ్చలేదు. మీరు ఇతడి పట్ల జాగ్రత్త వహించాలని చెప్పాను. కానీ వాళ్లు దీన్ని పట్టించుకోలేదు. సరిగ్గా ఏడాది తర్వాత అతడు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను పేల్చేశాడు. దీనిపట్ల నేను కొంచెం క్రెడిట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరూ ఈ క్రెడిట్ ఇవ్వరని'' ట్రంప్ అన్నారు.
Also Read: భూటాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన బ్రిడ్జ్.. వేలాది మంది వరదల్లో?
VIDEO | Washington DC: US president Donald Trump says, "History will never forget that it was the SEALs who stormed the compound at Osama bin Laden and put a bullet in his head. Remember that. And please remember I wrote about Osama bin Laden exactly one year ago, one year before… pic.twitter.com/6lA3yAKfbd
— Press Trust of India (@PTI_News) October 6, 2025
అయితే 2000 జనవరి 15న డొనాల్డ్ ట్రంప్, డేవ్ షిఫ్లెట్‌లు కలిసి ''ది అమెరికా వి డిసర్వ్'' అనే పుస్తకాన్ని ప్రచూరించారు. బహుశా ట్రంప్ ఇదే బుక్‌లో ఒసామా బిన్ లాడెన్ గురించి రాసినట్లు తెలుస్తోంది. ఆయన బిన్‌లాడెన్ గురించి అమెరికా ప్రభుత్వానికి హెచ్చరించినట్లు రాశారా ? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. దీనిపై వాస్తవాలు తెలియాల్సి ఉన్నాయి.
Also Read: మరో భారతీయుడి దారుణ హత్య.. బాగున్నావా? అని అడిగినందుకే చంపేశాడు!