Trekkers Trapped: ఎవరెస్ట్‌పై మంచు తుపాను బీభత్సం.. చిక్కుకుపోయిన 1,000 మంది పర్వతారోహకులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ప్రాంతంలో హిమపాతం, మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు 1,000 మందికి పైగా పర్వతారోహకులు ఎవరెస్ట్‌పై చిక్కుకుపోయారు. అక్టోబర్ నెలలో ఎవరెస్ట్ పర్వతంపై ఇలాంటి మంచుతుపాన్లు అసాధారణం.

New Update
blizzard hits Mount Everest

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం ప్రాంతంలో హిమపాతం, మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. దాదాపు 1,000 మందికి పైగా పర్వతారోహకులు ఎవరెస్ట్‌పై చిక్కుకుపోయారు. అక్టోబర్ నెలలో ఎవరెస్ట్ పర్వతంపై ఇలాంటి మంచుతుపాన్లు అసాధారణం. చైనా నేషనల్ డే సందర్భంగా పెద్ద సంఖ్యలో పర్వతారోహకులు ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు వెళ్లారు. మార్గ మధ్యలో 'కర్మ వ్యాలీ'లో మంచుతుపాను వారిని ఇబ్బందులకు గురి చేసింది. 

Also Read :  బంగ్లాదేశ్‌లో 793 దుర్గామాత మండపాలపై ఎంక్వైరీ.. ఎందుకంటే?

Mount Everest Blizzard

Also Read :  భూటాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన బ్రిడ్జ్.. వేలాది మంది వరదల్లో?

ట్రెక్కర్లు చిక్కుకుపోయినట్లు(Trekkers Trapped) సమాచారం అందుకున్న వెంటనే చైనా అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. టిబెట్ బ్లూ స్కై రెస్క్యూ టీమ్, స్థానిక అధికారులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రోడ్లపై, ట్రెక్కింగ్ మార్గాల్లో పేరుకుపోయిన భారీ మంచును తొలగించి, చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటికే 350 మందికి పైగా ట్రెక్కర్లను సురక్షితంగా 'ఖుడాంగ్' అనే చిన్న పట్టణానికి తరలించినట్లు చైనా మీడియా వెల్లడించింది. మిగిలిన ట్రెక్కర్లను సంప్రదించగలిగినట్లు, వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. తీవ్రమైన చలి, హైపోథెర్మియా ముప్పు ఉన్నందున రెస్క్యూ టీమ్‌లు జాగ్రత్తగా పనిచేస్తున్నాయి. విపరీతమైన మంచు కురవడంతో చాలా టెంట్లు కూలిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ప్రాంతానికి తాత్కాలికంగా టికెట్ల విక్రయాన్ని నిలిపివేశారు. 

సాధారణంగా అక్టోబర్ నెలలో ఈ ప్రాంతంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ, ఈ ఏడాది అసాధారణంగా ఇంతటి భారీ మంచు తుఫాను రావడం ఆందోళన కలిగిస్తోంది. చైనాలో జాతీయ సెలవులు కావడంతో పర్వతారోహకుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో, ఆందోళన రెట్టింపైంది. అందరినీ సురక్షితంగా రక్షించే వరకు ప్రయత్నాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు