/rtv/media/media_files/2025/01/28/pGUkh8zRIxXdG8011pgB.jpg)
deepseek
చైనా (China) కు చెందిన డీప్‌సీక్ స్టార్టప్ సంస్థ ఏఐ లో సంచలనం సృష్టిస్తోంది. అతి తక్కువ ఖర్చుతో అధునాతన ఏఐ మోడల్ ను ఆవిష్కరించి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం దీని పై ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో డీప్‌సీక్ పనితీరు పై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు.దీని పనితీరు ఆకట్టుకుంటోందంటూ ప్రశంసించారు.
Also Read: BIG BREAKING: అమెరికన్లకు ట్రంప్ అదిరిపోయే శుభవార్త.. ఆదాయపు పన్ను రద్దు!
డీప్‌సీక్ ఆవిష్కరించిన ఆర్ 1 మోడల్ ఆకట్టుకుంటోంది.ఆ ధరకు సేవలు అందజేయడం విశేషం. కొత్త పోటీదారుని కలిగి ఉండడం ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మేము త్వరలోనే మరింత మెరుగైన మోడల్ ను తీసుకొస్తాం అని శామ్ ఆల్ట్‌మన్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. మెరుగైన మోడల్ ను తీసుకురావడం కోసం తన ఏఐ స్టార్టప్ సామర్థ్యం పై విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: France: మస్క్ తీరు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పే..ఫ్రాన్స్ ప్రధాని!
Open AI - DeepSeek
మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఓపెన్ ఏఐ (Open AI) తన ప్రణాళికను మార్చుకుంటుందన్నారు. ప్రపంచానికి ఏఐ అవసరమన్న ఆయన తరువాతి తరం ఏఐ మోడల్స్ ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారన్నారు.ప్రస్తుతం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. త్వరలోనే ఈ సాంకేతికతను పరిచయం చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
తక్కువ ధరకే చైనీస్ ఆర్టిఫిషియ్ ఇంటెలిజెన్స్ మోడల్ అయిన డీప్‌సీక్ గత నెలలోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.దాని డీప్‌సీక్ -వి 3 మోడల్ కు శిక్షణ ఇచ్చేందుకు తక్కువ సామర్థ్యం గల ఎన్విడియా హెచ్ 800 చిప్ లను ఉపయోగించినట్లు పేర్కొంది. అయితే ఈ ఆర్ 1 ఏఐ మోడల్ పూర్తిగా ఉచితం కావడంతో విశేష ఆదరణను పొందింది.
ఆకస్మాత్తుగా వార్తల్లో నిలిచిన ఈ సంస్థ తాజాగా సైబర్ దాడికి గురైంది. తమ సేవల పై తీవ్ర స్థాయి సైబర్ దాడి జరిగినట్లు డీప్‌సీక్ (DeepSeek) వెల్లడించింది. దీని కారణంగా కొత్త యూజర్లు రిజిస్టర్ చేసుకోలేకపోతున్నారని తెలిపింది. అయితే ఇప్పటికే రిజిస్టర్ అయిన యూజర్లు యథావిధిగా సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది.
Also Read:BREAKING: ఘోర ప్రమాదాలు.. ఐదుగురు దుర్మరణం
Also Read: Britan: ఇక నుంచి వారానికి 4 రోజులే పని..ఆ కంపెనీల తుది నిర్ణయం!