Britan: ఇక నుంచి వారానికి 4 రోజులే పని..ఆ కంపెనీల తుది నిర్ణయం!

యూకేకు చెందిన కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు పని దినాలను అమలు చేస్తున్నాయి.పేరొందిన పలు ఛారిటీలు,మార్కెటింగ్‌,టెక్నాలజీ సంస్థలు సహా 200 కంపెనీలు ఈ విధానంలో ఉన్నట్లు సమాచారం.

New Update
japan

పని గంటల పై భారత్‌ (India) సహా అనేక దేశాల్లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. యూకేకు చెందిన కొన్ని కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు పని దినాలను అమలు చేస్తున్నాయి.పేరొందిన పలు ఛారిటీలు,మార్కెటింగ్‌,టెక్నాలజీ సంస్థలు సహా 200 కంపెనీలు ఈ విధానంలో మారినట్లు బ్రిటన్‌ మీడియా కథనాలు వెల్లడించాయి.

Also Read:Telangana: సరస్వతి పుష్కరాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి.. ఎప్పుడు, ఎక్కడ..అంటే

వందేళ్ల కిందటి విధానాలు...

4 డే వీక్‌ ఫౌండేషన్‌ (4 Day Week Foundation) చేసిన సర్వేలో భాగంగా ఈ విషయం వెల్లడైనట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. తాజా పని విధానంతో ఈ కంపెనీల్లో పని చేస్తున్న 5 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు.దీని పై4 డే వీక్‌ ఫౌండేషన్‌ క్యాంపెయిన్‌ డైరెక్టర్‌ జో రైల్‌ మాట్లాడుతూ..9-5 జాబ్‌ వారానికి ఐదు రోజుల పని అనేవి వందేళ్ల కిందటి విధానాలు.

Also Read: Mauni Amavasya: మౌని అమావాస్య రోజు గంగలో మునిగితే పాపాలు పోతాయా? మహాకుంభమేళకు పోటెత్తుతున్న భక్తులు

ప్రస్తుత అవసరాలకు ఇవి పని చేయవు.మనం అప్డేట్‌ అవ్వాల్సిన సమయం వచ్చింది. వారానికినాలుగు రోజుల పని విధానంతో ఉద్యోగులకు ఎక్కువ ఖాళీ సమయం అందుబాటులో ఉంటుంది. దాని వల్ల ప్రజలు సంతృప్తికర జీవితాలను గడిపేందుకు స్వేచ్ఛ లభిస్తుంది అని అభిప్రాయపడ్డారు.

తొలుత ఈ వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని బ్రిటన్‌ (Britain) లో దాదాపు 30 మార్కెటింగ్‌,అడ్వర్టైజింగ్‌, ప్రెస్‌ రిలేషన్స్‌ సంస్థలు అమలు చేశాయి. ఆ తర్వాత 29 ఛారిటీలు, 24 టెక్నాలజీ , ఐటీ, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, 22 మేనేజ్‌ మెంట్‌,కన్సల్టింగ్‌ సంస్థలు కూడా ఇదేబాట పట్టినట్లు సర్వేలో వెల్లడైంది.

అత్యధికంగా లండన్‌ లో 59 కంపెనీలు ఈనూతన పని విధానాన్నిఅనుసరిస్తున్నాయి. 

Also Read:Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం

Also Read: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు