/rtv/media/media_files/2025/01/24/WCj1FyO3Vllcy868YabG.webp)
Field Assistant Murder
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరాంఘర్ ఫ్లై ఓవర్(మన్మోహన్ సింగ్ ఫ్లై ఓవర్) పైన బైక్ డివైడర్ ను వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. బహుదూర్ పుర్ నుంచి ఆరంఘర్ వెళ్తుండగా ఈ దారుణ ఘటన జరిగింది. అతి వేగం, ట్రిపుట్ రైడింగే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Also Read:Delhi Burari: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకుని!
ఘటనా స్థలానికి వచ్చిన అత్తాపూర్ పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈ ప్రమాదం సోమవారం రాత్రి ఒంటి గంటకు ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మృతులు గోల్కొండ ఫతే దర్వాజాకు చెందిన మాజ్, అహ్మద్, తలాబ్ కట్టకు చెందిన సయ్యద్ ఇమ్రాన్ గా తెలుస్తుంది.
ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే రాజేంద్రనగర్ ఏసీపీ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలే ప్రారంభంచిన అరంఘర్ ఫ్లైఓవర్ కు డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. ఫ్లై ఓవర్ ఓపెన్ అయిన తర్వాత మొదటి ప్రమాదం ఇదే.
ఏపీలో మరో ప్రమాదం..
నంద్యాల జిల్లాలో ఓ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.. నంద్యాల మండలం చాపిరేవులలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి వృద్ధురాలు వెంకటమ్మా(60) , ఆరేళ్ళ బాలుడు పండు మృత్యువాత పడ్డారు. రెండు ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.. ఓ ఇంట్లో సోమవారం రాత్రి సమయంలో ఇంట్లో సిలిండర్ సరిగ్గా ఆఫ్ చేయకపోవడంతో.. గ్యాస్ ఇల్లంతా వ్యాపించింది.
అయితే, మంగళవారం తెల్లవారుజామున వృద్ధురాలు వెంకటమ్మ లైట్ వేయడంతో ఒక్కసారిగా సిలెండర్ పేలి, మంటలు వ్యాపించాయి. భారీగా శబ్దం చేస్తూ రెండు ఇళ్లు కాలిపోయాయి. మంటల్లో వృద్దురాలు వెంకటమ్మ , ఆరేళ్ల బాలుడు పండు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంటలను అదుపులోకి తెచ్చి, శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందిన బాలుడు పండును బయటికి తీశారు ఫైర్ సిబ్బంది.
మరో ఇంట్లో శిథిలాల కింద ఉన్న వెంకటమ్మ బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.. భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో.. గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.
Also Read: TG high court: 16 ఏళ్ల లోపు పిల్లలను ఆ సమయంలో థియేటర్లకు అనుమతించొద్దు: హైకోర్టు