Kerela state Awardsలో సత్తా చాటిన 'The Goat Life' ఏకంగా తొమ్మిది కేటగిరీల్లో.. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్

54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేరళ CM పినరయి విజయన్ విజేతలకు అవార్డులు ప్రధానం చేశారు. 'ఆడుజీవితం' చిత్రానికి పృథ్వీరాజ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.

New Update
Prithvi raj sukumaran kerela state award

Prithvi raj sukumaran kerela state award

54th Kerela state Awards:  బుధవారం తిరువనంతపురం వేదికగా 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మలయాళ చిత్రపరిశ్రమ నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఆడుజీవితం' చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకోగా..  ఊర్వశి,  బీనా ఆర్ చంద్రన్ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అలాగే పృథ్వీరాజ్ ఆడుజీవితం చిత్రం తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకొని సత్తా చాటింది.  మమ్ముట్టి  'కాతల్ - ది కోర్'ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. దాదాపు 160 మలయాళ చిత్రాలు ఈ అవార్డుల కోసం పోటీపడ్డాయి. 

Also Read :  విద్యార్థులకు పండగే.. వరుసగా మూడు రోజులు హ్యాలిడేస్

ప్రముఖ దర్శకుడు షాజీ ఎన్ కరుణ్  మలయాళ సినిమాకు చేసిన కృషికి  గానూ ప్రతిష్టాత్మక జెసి డేనియల్ అవార్డును అందుకున్నారు. అలాగే రూ. 5 లక్షలు,  గౌరవ ధృవీకరణ పత్రం ఆయనకు లభించాయి.

Also Read :  చర్మ రకాన్ని బట్టి ఏ ఫేషియల్ సరైనదో ఇలా తెలుసుకోండి

బుధవారం తిరువనంతపురం వేదికగా 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు మలయాళ చిత్రపరిశ్రమ నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఆడుజీవితం' చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ ఉత్తమ నటుడిగా అవార్డును అందుకోగా..  ఊర్వశి,  బీనా ఆర్ చంద్రన్ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. అలాగే పృథ్వీరాజ్ ఆడుజీవితం చిత్రం తొమ్మిది విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకొని సత్తా చాటింది.  మమ్ముట్టి  'కాతల్ - ది కోర్'ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. దాదాపు 160 మలయాళ చిత్రాలు ఈ అవార్డుల కోసం పోటీపడ్డాయి. 

ప్రముఖ దర్శకుడు షాజీ ఎన్ కరుణ్  మలయాళ సినిమాకు చేసిన కృషికి  గానూ ప్రతిష్టాత్మక జెసి డేనియల్ అవార్డును అందుకున్నారు. అలాగే రూ. 5 లక్షలు,  గౌరవ ధృవీకరణ పత్రం ఆయనకు లభించాయి.

అవార్డు విజేతల ఫుల్ లిస్ట్ 

  • ఉత్తమ నటుడు: పృథ్వీరాజ్ సుకుమారన్ (ఆడుజీవితం)
  • ఉత్తమ దర్శకుడు: బ్లెస్సీ (ఆడుజీవితం)
  • సంపూర్ణ వినోదాన్ని అందించిన ఉత్తమ చిత్రం: ఆడుజీవితం
  • ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: రంజిత్ అంబాడి (ఆడుజీవితం)
  • ఉత్తమ ప్రాసెసింగ్ ల్యాబ్/కలరిస్ట్: ఆడుజీవితం
  • ఉత్తమ నటి: ఊర్వశి (ఉల్లోజుక్కు) , బీనా ఆర్ చంద్రన్ (తాడవు)
  • ఉత్తమ చిత్రం: కథల్: ది కోర్
  • ఉత్తమ రెండవ చిత్రం: ఇరట్ట
  • ఉత్తమ సహాయ నటుడు: విజయరాఘవన్ (పూక్కలం)
  • ఉత్తమ నూతన దర్శకుడు: ఫాజిల్ రసక్ (తాడవు)
  • బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ (మేల్ ): రోషన్ మాథ్యూ (ఉల్లోజుక్కు, వాలట్టి)
  • ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ (ఫిమేల్ ): సుమంగళ (జననం 1947 ప్రణయం తుదరున్ను)
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: ఫెమినా జబ్బార్ (ఓ బేబీ)

Also Read :  11 ఏళ్ల బాలికపై కీచకుడి అత్యాచారం.. పొలాల్లో నగ్నంగా, తీవ్ర గాయాలతో చిన్నారి

స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ 

  • ప్రత్యేక జ్యూరీ అవార్డు (నటన): కృష్ణన్ (జైవం)
  • ప్రత్యేక జ్యూరీ అవార్డు (నటన): సుధీ కోళికోడ్ (కథల్: ది కోర్)
  • స్పెషల్ జ్యూరీ అవార్డు (చిత్రం): గగనాచారి
  • స్పెషల్ జ్యూరీ అవార్డు (మహిళ): షాలినీ ఉషా దేవి (ఎన్నెన్నం)
  • స్పెషల్ జ్యూరీ అవార్డు (విజువల్ ఎఫెక్ట్స్): 2018
  • ప్రత్యేక జ్యూరీ అవార్డు (నటన): KR గోకుల్ (ఆడుజీవితం)

latest-news | cinema-news  Kerala State Film Awards 

Also Read: Netflix Movies: ఏప్రిల్ లో నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ సినిమాలు అవుట్.. చూడకపోతే వెంటనే చూసేయండి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు