IND-PAK WAR : భారతదేశానికి , పాకిస్థాన్ మధ్య నెలకొన్న యుద్ధం ఒక వైపు కొనసాగుతుండగా పాకిస్థాన్ తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. మరోవైపు పాక్‌కు ఇంటి పోరు మరింత ఉదృతమైంది. పాక్ భారత్‌తో తలపడుతున్న సమయంలోనే తమ పోరాటాన్ని కొనసాగించి స్వాతంత్య్రం సాధించాలని బలూచిస్తాన్ గట్టిగా నిర్ణయించుకుంది. పశ్చిమ సరిహద్దుల్లో బలూచిస్తాన్‌లో స్వాతంత్ర్యం కోరుతూ బలూచ్ తిరుగుబాటుదారులు పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్నారు. అనేక చోట్ల పాకిస్థాన్ సైనికులపై దాడిచేసి వారిని హతమారుస్తున్నారు. బలూచిస్తాన్‌లోని ఐదు చోట్ల BLA పోరాట యోధులు పాక్ సైన్యంపై మెరుపు దాడులు చేశారు. పాక్ ఆర్మీ స్థావరాలుగా ఉన్న క్వెట్టా, ఉతల్, సోహ్‌బత్‌పూర్, పంజ్‌గుర్ ప్రాంతాల్లో ఈ దాడులు సాగాయి. మరో వైపు పలు గ్రూపులుగా ఉన్న బలూచ్ తిరుగుబాటు దారుల కొన్ని ప్రాంతాలు తమ ఆధీనంలోకి వచ్చినట్లు ప్రకటించుకున్నాయి. ముఖ్యంగా మూడు ప్రధాన బలూచ్ గ్రూపులు పశ్చిమ ప్రావిన్స్‌లోని అనేక ప్రాంతాలపై పై చేయి సాధించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్
అనేక సంవత్సరాలుగా స్వాతంత్ర్య బలూచిస్తాన్ కోసం పోరాడుతున్న బలూచ్ తిరుగుబాటు దారులకు భారత్, పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత కలిసి వచ్చిందనే చెప్పాలి. భారత్‌తో పోరాటానికి అటువైపు ఎక్కువ సైన్యాన్ని మొహరించాల్సి ఉండటంతో ఈ ప్రాంతంలో కొంత సైన్యాన్ని తగ్గించుకోవలసి వచ్చింది. దీన్ని అనుకూలంగా మార్చుకున్న బలూచ్ తిరుగుబాటు దారులు పాక్ సైన్యంపై మెరుపుదాడులకు దిగారు. దీంతో పలు చెక్‌పోస్టులను వదిలి పాక్ సైన్యం పరుగందుకుంది. అంతేకాదు పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న బలూచిస్తాన్ ఆయా ప్రాంతాల్లో తమ విజయానికి గుర్తుగా పాకిస్థాన్ జెండాలను తీసివేసి బలూచిస్తాన్ జెండాలను ఎగురవేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం(మే 09), క్వెట్టాలో ఫైజాబాద్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై బలూచ్ తిరుగుబాటు దారులు దాడి చేశారు. మరో వైపు సిబిలోని ఆర్మీ క్యాంప్‌పై గ్రెనేడ్‌లతో దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లాయి. క్వెట్టాలో నాలుగు వేర్వేరు ప్రదేశాలలో సాయుధులు దాడులు చేశారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్ దళాలను లక్ష్యంగా చేసుకుని కెచ్, మస్తుంగ్, కాచిలలో కనీసం ఆరు మెరుపు దాడులు నిర్వహించినట్ల తెలుస్తోంది. ఇదే విషయాన్ని బలూచ్ కు చెందిన రైటర్ మీర్ యార్ బలూచ్ తన సోషల్ మీడియా X ఖాతాలో వెల్లడించారు. బలూచ్ ప్రజలు స్వాతంత్ర్యానికి చేరువలో ఉన్నారనిఇ తమ సొంత జెండాలను ఎగురవేసి పాకిస్తాన్ జెండాలను తొలగిస్తున్నారని తెలిపారు. ప్రపంచం తమ దౌత్య కార్యకలాపాలను పాకిస్తాన్ నుండి ఉపసంహరించుకుని స్వతంత్ర బలూచిస్తాన్‌కు తరలించాల్సిన సమయం ఆసన్నమైందని మీర్ యార్ బలూచ్ పేర్కొనడం విశేషం.
Also Read: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన!
గత కొన్నాళ్లుగా బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం, పాక్ సైన్యం తమ నియంత్రణను కోల్పోయిందని పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి షాహిద్ ఖాకాన్ అబ్బాసి ఒక ప్రకటన చేశారు. దానికి బలాన్ని చేకూర్చుతూ ఈ దాడులు జరగడం గమనార్హం. పూర్తి స్థాయి రక్షణ దళాలు లేకుండా బలూచిస్తాన్‌లో ప్రభుత్వ అధికారులు పర్యటించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇదిలావుంటే, కెచ్ జిల్లాలోని దష్టుక్ ప్రాంతంలో బిఎల్‌ఎ తిరుగుబాటు దారులు రిమోట్ కంట్రోల్డ్ ఐఇడితో పాకిస్తాన్ కు చెందిన బాంబు నిర్వీర్య బృందాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక సైనికుడిని చంపారు.
Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు