/rtv/media/media_files/2025/12/03/russia-2025-12-03-07-19-24.jpg)
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని(Russia Ukraine War) ఆపాలని అమెరికా(usa) తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ 28 సూత్రాలతో శాంతి ప్రణాళికను కూడా రూపొందించారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ శాంతి ప్రణాళికకు నో చెప్పిన ఉక్రెయిన్ తర్వాత కొన్ని మార్పులతో ఓకే చెప్పింది. అయితే రష్యా మాత్రం దీనిపై ఇంకా చర్చలు చేస్తోంది. ప్రస్తుతం క్రెమ్లిన్ లో అమెరికా, రష్యాల మధ్య చర్చలు జరిగాయి. కానీ ఇందులో ఎటువంటి పురోగతి సాధించలేకపోయారని తెలుస్తోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్రెమ్లిన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అల్లుడు జారెడ్కుష్నర్ , ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్‌లను కలిశారు. ఉక్రెయిన్ లో రష్యా ఆక్రమించిన భూభాగాలపై రాజీ పడలేదని క్రెమ్లిన్ చెప్పింది. కానీ ఇంకా పరిష్కారాల కోసం ఆలోచిస్తున్నామని తెలిపింది. మరోవైపుట్రంప్ కూడా దాదాపు నాలుగు సంవత్సరాలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడంలో పురోగతి అంత సులభం కాదన్నారు. అయితే ప్రణాళికలో మార్పులు చేశాక కూడా అందులో తమకు అభ్యంతరాలు ఉన్నాయని రష్యా చెబుతోంది. క్రెమ్లిన్‌లో ఐదు గంటల పాటు జరిగిన సమావేశంలో చర్చించిన తొలి అమెరికా ప్రణాళికను నాలుగు భాగాలుగా విభజించినట్లు తెలిపారు. ఇందులో కొన్ని అంగీకరించే విషయాలు కొన్ని ఉన్నాయని..కానీ భూభాగం విషయంలో రాజీ లేదని పుతిన్ చెప్పారు. మాస్కో తనదని చెప్పుకునే కైవ్ భూభాగాన్ని అప్పగించాలని పుతిన్ డిమాండ్ చేశారు.
Also Read : ఇమ్రాన్ ఖాన్ ను హింసిస్తున్నారు... సోదరి ఉజ్మా ఖాన్ సంచలన కామెంట్స్
యూరోప్ యుద్ధాన్ని కోరుకుంటే..
యూరప్‌తో యుద్ధం చేయాలని ప్లాన్ చేయడం లేదు, కానీ యూరప్ కోరుకుంటే, ప్రారంభిస్తే.. మేము ఇప్పుడే సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. అమెరికా రాయబారులను కలవడానికి ముందు ఈ వ్యాఖ్యలను చేశారు. వారికి శాంతి ఎజెండా లేదు, ఎప్పుడూ యుద్ధం చేయాలనే కోరుకుంటారు అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌లో శాంతిని స్థాపనకు అమెరికా ప్రయత్నాలను యూరోపియన్ నాయకులు అడ్డుకుంటున్నారనే తన వాదనను పునరావృతం చేశారు.
ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం తొందరగా యుద్ధాన్ని ముగించాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న చర్చలు కేవలం ఫిబ్రవరి 2022లో మాస్కో దాడితో ప్రారంభమైన పోరాటాన్ని నిలిపివేయడానికి మాత్రమే దారితీయకూడదని...యుద్ధాన్ని శాశ్వతంగా ముంగించేందుకు దోహదపడాలని అన్నారు.
Also Read : ఛీ.. ఛీ.. అసలు వీళ్లు మనుషులేనా.. పాక్ చేసిన ఈ చిల్లర పని చూస్తే ఉమ్మేస్తారు!
Follow Us