/rtv/media/media_files/2025/12/02/pak-2025-12-02-16-50-43.jpg)
పాకిస్తాన్(pakistan) తన నీచపు బుద్ధి పోనిచ్చుకోలేదు. ఒకపక్కా తుఫాను తాకిడికి గురైన శ్రీలంక(srilanka) అష్ట కష్టాలు పడుతోంది. భారత్(india) తో పాటుగా చాలా దేశాలు సహయం చేసి ఆదుకుంటున్నాయి. మనం కూడా చేయకపోతే పరువుపోతుందని భావించిన పాకిస్తాన్ ముందుకు వచ్చింది. అయితే ఆ దేశం పంపిన సహాయ సామగ్రిలో అన్ని ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన వస్తువులు ఉన్నట్లు కొలంబో అధికారులు గుర్తించారు. అందులో నిత్యావసర సరుకుల తయారీ తేదీ 2022 కాగా.. 2024 అక్టోబర్ నెలకే ముగిసినట్లు ఉంది.
VERY SHAMEFUL Pakistan's "emergency support" to Sri Lanka: Unusable packets past expiry!
— Diganta Hazarika (@Diganta701) December 2, 2025
Social media erupts as High Commission scrubs post. How low can they go? #SriLankafloods#DiplomaticDisasterpic.twitter.com/OX2weQdYre
సైక్లోన్ దిత్వా బాధితులకు సహాయం అందించే ఉద్దేశంతో పంపిన ఆహార ప్యాకెట్లు, ఇతర నిత్యావసరాల్లో అన్ని ఎక్స్‌పైరీ డేట్ ఇప్పటికే దాటిపోయినట్లు శ్రీలంక అధికారులు గుర్తించారు. ఈ విషయంపై శ్రీలంక విపత్తు నిర్వహణ, విదేశాంగ శాఖలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఘటన- పాకిస్తాన్‌కు అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ, దౌత్యపరమైన ఇబ్బందులను తెచ్చిపెట్టింది. మానవతా సాయం అందించే విషయంలో ఈ రకమైన నిర్లక్ష్యం అమానవీయం అని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
Also Read : రావల్పిండిలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల తిరుగుబాటు...144 సెక్షన్
తప్పుడు ప్రచారానికి తెర
మరోవైపు ఈ ఎక్స్‌పైరీ అయిపోయిన సరుకులను శ్రీలంకకు పంపేందుకు ఉపయోగించిన తమ విమానానికి.. భారత్ గగనతలాన్ని నిరాకరించిందంటూ పాక్ మరో తప్పుడు ప్రచారానికి తెరలేపింది. దీనిపై వెంటనే భారత్ రియాక్ట్ అయింది. శ్రీలంకకు మానవతా సహాయం అందించాలనే దృక్పథంతోనే పాక్ విమానాలకు అనుమతులు ఇచ్చినట్లుగా భారత అధికారులు స్పష్టం చేశారు. పాకిస్థాన్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు గగనతల అనుమతి కోసం సంప్రదించగా.. సాయంత్రం 4.30 గంటలకే భారత్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
పాకిస్తాన్‌కు ఇలాంటి పనులు చేసి విమర్శలు ఎదురుకోవడం ఇదేం తొలిసారి కాదు.. 2015 నేపాల్ భూకంపం సమయంలో హిందూ మెజారిటీ దేశమైన నేపాల్‌కు బీఫ్ ఆధారిత రెడీ-టు-ఈట్ భోజనాన్ని పంపి అక్కడి ప్రజల ఆగ్రహానికి గురైంది. కాగా- దిత్వా తుఫాన్ ధాటికి శ్రీలంక అల్లాడుతోంది. వరదలు ముంచివేశాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. మొత్తం 25 జిల్లాల్లో 366 మందికి పైగా మరణించారు. 400 మంది గల్లంతయ్యారు. కోటి మందికి పైగా ప్రభావితం అయ్యారు. వేలాది ఇళ్ళు, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.
Also Read : H-1B Visa: దారుణంగా పడిపోయిన హెచ్-1 బీ వీసా పిటిషన్లు..పదేళ్ల కనిష్టానికి..
Follow Us