CIA: చైనా రహస్యాలు చెప్పండి.. అమెరికా బంపర్ ఆఫర్

చైనాలోని అణిచివేతకు గురవుతున్న అక్కడి ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) కీలక ప్రకటన చేసింది. మాతో కలిసి పనిచేయడానికి రావాలంటూ ఓ రిక్రూట్‌మెంట్ వీడియో రిలీజ్ చేసింది.

New Update
CIA releases Mandarin-language videos to encourage Chinese officials to spill secrets

CIA releases Mandarin-language videos to encourage Chinese officials to spill secrets

చైనాలోని అణిచివేతకు గురవుతున్న అక్కడి ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమెరికా నిఘా సంస్థ సీఐఏ (CIA) కీలక ప్రకటన చేసింది. మాతో కలిసి పనిచేయడానికి రావాలంటూ మాండరిన్ భాషలో ఓ రిక్రూట్‌మెంట్ వీడియో రిలీజ్ చేసింది. చైనా చేపడుతున్న గూఢచర్య ఆపరేషన్‌లకు ప్రతిచర్యగా ఈ నియామకాలు చేపట్టినట్లు సమాచారం. చైనా నుంచి రహస్య సమాచారం సేకరించడం కోసమే ఈ వీడియో విడుదల చేశామని CIA డైరెక్టర్ జాన్‌ రాట్‌క్లిఫ్ తెలిపారు. 

Also Read: భార్యను చంపి మంచం కింద పాతిపెట్టిన భర్త.. చేయి బయటకు రావడంతో ఊహించని ట్విస్ట్!

'' నిఘా వ్యవస్థలో మానవ వనరులు పెంచుకోవడంతో సహా చైనాపై మరింత ఫోకస్ పెట్టేందుకు ఈ చర్యలు తీసుకున్నాం. ఆర్థికంగా, సాంకేతికంగా, సైనికపరంగా ప్రపంచంపై చైనా ఏకఛత్రాధిపత్యం చేయాలని చూస్తోంది. అంతేకాదు ఆ దేశం నుంచి మాకు గూఢచర్య ముప్పు ఉంది. దాన్ని పరిష్కరించడం కోసం ఈ వీడియోలు రిలీజ్ చేశాం. చైనా అధికారుల నుంచి రహస్యాలు సేకరించడమే వాటి లక్ష్యమని'' రాట్‌క్లిఫ్ అన్నారు.  

Also Read: పాక్‌ ఉక్కిరి బిక్కిరి.....అంతర్గత ఘర్షణలు...పొరుగు దేశాలతో విబేధాలు

అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్స్ ఏజెన్సీ(CIA) యూట్యూబ్‌లో, అలాగే ఎక్స్‌లో ఈ వీడియోలు రిలీజ్ చేశారు. కేవలం గంటల వ్యవధిలోనే ఏకంగా 50 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. ఈ వీడియో రెండు నిమిషాలకు పైగా ఉంది. ఇందులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా సన్నివేశాలు చూపించారు. నిజాయతీగా ఉండే ఓ పార్టీ నేత.. కమ్యూనిస్ట్‌ పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన పరిస్థితిలో ఉంటాడు. చివరకి అతడు భయంతో బతకలేక అమెరికాకు చెందిన CIAను ఆశ్రయిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కానీ వీటిపై చైనా స్పందించలేదు.

Also Read:  పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. ప్రజల దృష్టి మార్చేందుకే ఉగ్రదాడికి దిగిందా ?

Also Read: లండన్‌లో భారత జెండాను అవమానించిన అల్లరి మూకలు.. కాళ్ల కింద నలిపేసిన వీడియో

telugu-news | rtv-news | china | usa

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు