/rtv/media/media_files/2025/05/03/jpAtNHoCZmwaGoxXehqW.jpg)
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్యను హత్య చేసి మృతదేహాన్ని తన ఇంట్లో ఉన్న మంచం కింద పాతిపెట్టాడు. అయితే ఆ మృతదేహాన్ని సరిగ్గా పూడ్చిపెట్టకపోవడంతో ఆమె చేయి బయటకు వచ్చింది. అది కొన్ని రోజుల తర్వాత దుర్వాసన రావడం ప్రారంభించడంతో ఈ హత్య రహస్యం బయటపడింది. ఈ హత్యలో నిజం బయటపడుతుందనే భయంతో నిందితుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చూడండి: డేంజర్ జోన్‌లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!
భార్యను చంపి ఇంట్లోనే పాతిపెట్టాడు
బార్వా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సుల్గావ్ గ్రామంలో లక్ష్మణ్ (45), తన భార్య రుక్మణి బాయి (40) కలిసి నివాసముంటున్నారు. గత కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీంతో లక్షణ్ తన భార్య రుక్మణిని హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని తన ఇంట్లోని ఒక గదిలో ఉన్న మంచం కింద గొయ్యి తీసి పాతిపెట్టాడు. అనంతరం గత 4 నుంచి 5 రోజులుగా అదే మంచం మీద అతడు పడుకున్నాడు.
ఇది కూడా చూడండి: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!
అయితే ఆమె మృతదేహాన్ని సరిగ్గా పూడ్చిపెట్టకపోవడంతో.. రుక్మిణి చేయి ఒకటి బయటకు వచ్చింది. దాన్నుంచి రెండు-మూడు రోజుల తర్వాత తీవ్ర దుర్వాసన రావడంతో సమీపంలో నివసించే వారికి అనుమానం వచ్చింది. దీంతో కొంతమంది లక్ష్మణ్‌ను ప్రశ్నించారు. అతడి భార్య ఎక్కడ ఉంది? అని అడిగారు. కానీ అతడు సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేవాడు.
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
ఇక తాను పోలీసులకు దొరికిపోతాననే భయంతో లక్ష్మణ్ తన ఇంటి ముందే పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్వాసన రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి తాళం పగలగొట్టి ఇంట్లో వెళ్లారు. దీంతో మంచం కింద నుంచి ఒక చేయి బయటకు ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని గ్రామస్తులు వెంటనే పోలీసులకు తెలియజేశారు. వెంటనే బార్వా పోలీస్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఇంటి బయట లక్ష్మణ్ మృతదేహాన్ని, ఇంటి లోపల మంచం కింద ఉన్న రుక్మిణి బాయి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చూడండి: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు
crime news | latest-telugu-news | telugu-news | crime news today