ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్‌కు భారీ షాక్ ఇచ్చారు. ఇకపై తెలంగాణలో ఎలాంటి బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. అలాగే టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా ఎలాంటి అనుమతి ఇవ్వమని సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌కు బిగ్ షాక్ తగిలినట్లయింది. Also Read: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ జనవరి 10న గేమ్ ఛేంజర్ త్వరలో బడా హీరోల సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. రామ్ చరణ్, ప్రభాస్, వెంకటేష్, చిరంజీవి సహా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" సంక్రాంతి సందర్భంగా జనవరి 10న గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. Also Read: ధమ్ బిర్యానీలో బ్లేడ్.. హాస్పిటల్ పాలైన కస్టమర్! ఓ వైపు టికెట్ రేట్లు పెంచమని, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ మూవీ నిర్మాత దిల్ రాజు తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం గేమ్ ఛేంజర్. దీంతో దిల్ రాజు ఏం చేస్తాడు? అంటూ సినీ ప్రముఖులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఒక స్టార్ హీరో సినిమాకి ఎక్కువగా బెనిఫిట్ షోలతోనే కలెక్షన్లు వస్తాయి. కానీ ఇప్పుడు అవి కూడా లేవంటే దిల్ రాజుకు పెద్ద దెబ్బేనని పలువురు అంటున్నారు. Also Read: అల్లు అర్జున్‌పై ప్రెస్‌మీట్.. ఏసీపీ విష్ణుమూర్తిపై పోలీస్ శాఖ సీరియస్ దిల్ రాజ్ ఏం చేస్తాడో చూస్తా ఇదే విషయంపై తాజాగా మరో ప్రముఖ నిర్మాత నాగవంశీ స్పందించారు. ఓ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయనకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. సీఎం రేవంత్ టికెట్ రేట్లు పెంచనని, బెనిఫిట్ షోలు ఉండవని అన్నారు కదా.. దీనిపై మీరెమంటారు అని నాగవంశీని మీడియా అడిగింది. దిల్ రాజు సినిమాలకు టికెట్ హైక్, బెనిఫిట్ షోస్ ఇస్తే మాక్కూడా ఇస్తారుFDC చైర్మన్ దిల్ రాజు మూవీ గేమ్ చేంజర్ ముందు విడుదల అవుతుందిఆయన మూవీకి తెలంగాణలో టికెట్ హైక్, బెనిఫిట్ షోస్ ఇస్తే మా సినిమాకు కూడా ఇస్తారు - ప్రొడ్యూసర్ నాగవంశీ pic.twitter.com/wLSyK8ZNVE — Telugu Scribe (@TeluguScribe) December 23, 2024 Also Read: అల్లు అర్జున్‌కు మరో బిగ్ షాక్..బెయిల్ రద్దుకు నేడు పిటిషన్! దానికి ఆయన స్పందిస్తూ.. మొదట నిర్మాత దిల్ రాజు సినిమా ఉందని.. ఆయన సినిమాకు టికెట్ హైక్, బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తే తమ సినిమాలకు ఇస్తారని అన్నారు. దిల్ రాజు ఏం తెలుస్తారో దాని బట్టి చూస్తామని చెప్పారు. దీంతో పలువురు కామెంట్లు పెడుతున్నారు. మీ సినిమాల గురించి చెప్పమంటే దిల్ రాజును బాగా ఇరికించావని నాగవంశీపై మండిపడుతున్నారు.