/rtv/media/media_files/2025/07/09/china-us-2025-07-09-07-34-48.jpg)
China-USA
China-USA: అమెరికా(America), చైనా మధ్య దూరం పెరుగుతూనే ఉంది. యూఎస్ చేసే ప్రతీ పనిపైనా చైనా మండిపడుతోంది. అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని ఇక ఒప్పుకునేది లేదని అంటోంది. ఇప్పటికే సుంకాల(Tariffs) విషయంలో అమెరికాతో ఫైట్ చేస్తున్న చైనా తాజాగా దలైలామా(Dalai Lama) విషయంలో మరోసారి ఆ దేశంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
దలైలామా విషయంలో మండిపాటు..
దలైలామా 90వ జన్మదిన వేడుకల సందర్భంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన వ్యాఖ్యలపై బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడైన దలైలామా.. ఐక్యత, శాంతి, కరుణని స్థాపించారని మార్కో ప్రశంసించారు. టిబెటన్ ప్రజలు తమ సొంత ఆధ్యాత్మిక నాయకులను ఎన్నుకునే స్వేచ్ఛతో సహా వారి సాంస్కృతిక, మతపరమైన గుర్తింపును కాపాడుకునే హక్కుకు ఉందని..దానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించారు. ఇప్పుడు దీనినే చైనా తప్పుబడుతోంది.
Also Read: నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్
దలైలామా మతం ముసుగులో చైనా వ్యతిరేక వేర్పాటువాద కార్యకలాపాలలో నిమగ్నమైన రాజకీయ బహిష్కృతుడని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ అన్నారు. టిబెటిన్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హక్కు దలైలామాకు లేదని చెప్పారు. టిబెట్ సంబంధిత విషయాలపై చైనా వైపు వేలు చూపే హక్కు లేదని మావో స్పష్టం చేశారు. అమెరికా వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అలాగే సుంకాల విషయాన్ని కూడా చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తోసి పుచ్చింది. సుంకాలు ఎవరికీ సహాయపడవని అంది.
Also Read: యుగాంతం ఎఫెక్ట్.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు