Income Tax Bill 2025: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ !

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను(IT) బిల్లు-2025 ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Cental Govt withdraws Income Tax Bill 2025, new bill to be tabled on August 11

Cental Govt withdraws Income Tax Bill 2025, new bill to be tabled on August 11

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను(IT) బిల్లు-2025 ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను చట్టం,1961 స్థానంలో.. ఆ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ 2025 బిల్లును కూడా కేంద్రం ఉపసంహరించుకున్నట్లు సమాచారం. అయితే దీన్ని అప్‌డేట్‌ చేసి కొత్త ఆదాయపు పన్ను బిల్లును ఆగస్టు 11న ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

Also Read: పెళ్లైన వ్యక్తితో సహజీవనం.. కూతుర్ని నరికి చంపిన తండ్రి.. ప్రియుడి పిటిషన్తో..!

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆదాయ పన్ను బిల్లు 2025ను ఫిబ్రవరి 13న కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కానీ ఈ బిల్లును విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో బిల్లును కేంద్రం సెలెక్ట్‌ కమిటీకి పంపించింది. ఈ కమిటీ దానిపై అధ్యయనం చేసింది. చివరికి జులై 21న తమ రిపోర్టును పార్లమెంటుకు అందించింది. 4500 పేజీలతో ఉన్న ఈ రిపోర్టులో ముసాయిదా బిల్లుకు 285 ప్రతిపాదనలు చేసింది. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం.. దీనికి అనుగుణంగా కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నూతన బిల్లును ఆగస్టు 11న లోక్‌సభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

Also Read: ముసలోడే కానీ మహానుబావుడు.. నలుగురు అమ్మాయిలతో 21 నెలలు 734 సార్లు!!

అయితే ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు సెలెక్ట్‌ కమిటీ కొన్ని కీలక సూచనలు చేసింది. ఇంటిపై ఆదాయం పొందుతున్న వాళ్లకి రిలీఫ్ ఇచ్చేలా కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుతం గృహ రుణ వడ్డీతో పన్ను మినహాయింపు ప్రయోజనం అనేది సొంతింట్లో ఉంటున్నవాళ్లకి మాత్రమే ఉంది. ఇప్పుడు సొంతింటిని అద్దెకు ఇచ్చినప్పుడు కూడా వడ్డీతో పన్ను మినహాయింపు కల్పించాలని కమిటీ సూచించినట్లు సమాచారం.అంతేకాదు TDS, TCS రీఫండ్లను కూడా సరళతరం చేయాలని ఆ కమిటీ సూచించింది. 

Also read: దెబ్బకు దెబ్బ..ప్రతీకార సుంకాల తర్వాత బోయింగ్ విమానాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్

1961లో రూపొందించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌కు, 66 బడ్జెట్‌లలో చాలావరకు సవరణలు జరిగాయి. ఇది సంక్లిష్టంగా మారడంతో పన్ను చెల్లింపుదారులకు ఖర్చులు పెరిగాయి. చివరికి ఈ చట్టాన్ని సమీక్షించి మార్పులు తీసుకొస్తామని 2024 జలై బడ్జెట్‌లో కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా ఉపసంహరించుకుని అప్‌డేటెడ్‌ బిల్లును తీసుకురానుంది. 

Also Read: మళ్లీ వార్తల్లోకి కేరళ పద్మనాభస్వామి ఆలయం.. ఆ సీక్రెట్ గదిలో అసలేముంది?

Advertisment
తాజా కథనాలు