/rtv/media/media_files/2025/08/08/rahul-gandhi-2025-08-08-18-24-08.jpg)
Rahul Gandhi
బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసీకీ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఎక్స్‌లో డిమాండ్ చేశారు. డిజిటల్ ఓటర్ల జాబితాను ఎందుకు దాస్తున్నారు?, సీసీటీవీ ఫుటేజీని ఎవరి ఆదేశాలతో తొలగిస్తున్నారు ?, ఫేక్ ఓట్లను ఎందుకు అరికట్టలేకపోతున్నారు ?, విపక్షాలను చూసి ఎన్నికల సంఘం ఎందుకు భయపడుతోంది ?, ఈసీ బీజేపీ ఏజెంట్‌గా మారిందా ? అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ !
లోక్‌సభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాహుల్‌గాంధీ శుక్రవారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో నిర్వహించిన నిరసన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఈసీని హెచ్చరించారు. '' ఇది కేవలం నా గొంతుక కాదు.. దేశ ప్రజలది. ఎన్నికల మోసం ఫిర్యాదుపై నా నుంచి ఈసీ అఫిడవిట్ కోరింది. రాజ్యాంగ మౌలిక సూత్రం ఒకే వ్యక్త, ఒకే ఓటు. కానీ ఎన్నికల సంఘం అధికారులు దీనిపైనే దాడులు చేస్తున్నారు. పేదలపై దాడి చేస్తున్నారు. ఎన్నికల్లో మోసం చేసి ఈజీగా తప్పించుకుందా అనుకుంటే అది మీ పొరపాటు. ఆలస్యమైనా సరే మిమ్మల్ని వదలిపెట్టాం. ఒక్కొక్కరిగా పట్టుకుంటాం.
బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఒక్క మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌పైనే మేము ఫోకస్ పెట్టాం. ఇక్కడ ఈసీ, బీజేపీ కలిసి మోసానికి పాల్పడినట్లు ఆధారాలు లభించాయి. మహదేవపురంలో మొత్తం 6.5 లక్షల ఓటర్లు ఉండగా అందులో 1.25 లక్షల ఓట్లను చోరీ చేశారు. ప్రతి ఆరుగురిలో ఒక ఓటును తారుమారు చేశారు. 5 పద్ధతుల్లో ఈ మోసం జరిగింది.
Also Read: మాకు హిందీ వద్దు.. తమిళనాడులో సొంతంగా విద్యా విధానం..
12 వేల మంది ఫేక్ ఓటర్లు అయిదారు పోలింగ్ బూత్‌లలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 40 వేల ఓట్లను ఫేక్ ఐడీలతో నమోదు చేశారు. ఒక ఇంటి అడ్రస్‌ను వందలాది ఓట్లపై నమోదు చేశారు. ఒక బీజేపీ నేత ఇంట్లో 40 మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు చూపించారు. ఆ ఇంటికి వెళ్లి చూడగా అక్కడ ఎవరూ లేరు. 4 వేల ఓటర్లకు అసలు ఫొటోలే లేవు. కొన్ని ఉన్నప్పటికీ అవి క్లారిటీగా లేవు. ఫారం 6 ద్వారా కొత్తగా 34 వేల మంది ఓటర్లను చేర్చారు. కానీ అందులో చాలావరకు 89 నుంచి 95 ఏళ్ల వారే ఉన్నారని'' రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం రాజ్యాంగం కోసం పనిచేయాలని బీజేపీ కోసం కాదంటూ ధ్వజమెత్తారు.
దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటర్ల లిస్టును, పోలింగ్ వీడియో రికార్డింగ్‌లను రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా ఇలాంటి మోసం జరిగినట్లు నిరూపిస్తామని సవాలు చేశారు. దేశంలో విపక్ష పార్టీలన్నీ ఈ అంశంపై ప్రశ్నిస్తాయని.. ఈసీ తక్షిణమే వాటికి సంబంధించిన డేటాను విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.
चुनाव आयोग, 5 सवाल हैं - देश जवाब चाहता है:
— Rahul Gandhi (@RahulGandhi) August 8, 2025
1. विपक्ष को डिजिटल वोटर लिस्ट क्यों नहीं मिल रही? क्या छिपा रहे हो?
2. CCTV और वीडियो सबूत मिटाए जा रहे हैं - क्यों? किसके कहने पर?
3. फर्जी वोटिंग और वोटर लिस्ट में गड़बड़ी की गई - क्यों?
4. विपक्षी नेताओं को धमकाना, डराना - क्यों?… pic.twitter.com/P0Wf4nh5hc