Good news: గ్యాస్ రాయితీపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్...వారికి మరో ఏడాది అవకాశం

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం పై లబ్ధిదారులకు ఇస్తున్న గ్యాస్‌ రాయితీని 2025-26 ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగించేందుకు కేంద్రం ఒకే చెప్పింది.

New Update
Pradhan Mantri Ujwala Yojana

Pradhan Mantri Ujwala Yojana

Pradhan Mantri Ujwala Yojana :  ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పథకం పై లబ్ధిదారులకు ఇస్తున్న గ్యాస్‌ రాయితీని 2025-26 ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగించేందుకు కేంద్రం ఒకే చెప్పింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్‌ సమావేశం సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

Also Read : తెలంగాణ ఆర్టీసీ బంఫర్‌ ఆఫర్‌.. బస్సు ఎక్కితే చాలు..

కాగా క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను  మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ మీడియాకు వివరించారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కొనసాగింపు కోసం రూ.12,000 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం మూలంగా దేశ వ్యాప్తంగా 10.33 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఉజ్వల్ పథకం కింద 14.2 కిలోల సిలిండర్ పై రూ. 300 రాయితీ ఇస్తారని, ఈ రాయితీ ఏటా 9 సిలిండర్లకు వర్తిస్తుందని మంత్రి వివరించారు.

ఇది కూడా చదవండి:  తల్లి ఎఫైర్.. తట్టుకోలేక కొడుకు సూ**సైడ్.. ఆ గ్రామంలో హైటెన్షన్!

మరోవైపు సాంకేతిక విద్యా అభివృద్ధి కోసం మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎంఈఆర్ఐటీఈ) పథకానికి కేంద్ర క్యాబినెట్‌ రూ. 4,200 కోట్లు కేటాయించింది. ఈ మేరకు క్యాబినెట్‌ అమోదం తెలిపిందని  అశ్వినీకుమార్ వైష్ణవ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 275 సాంకేతిక విద్యా సంస్థల్లో (ఎంఈఆర్ఐటీఈ) పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.  నైపుణ్యాల మెరుగు, ఉపాధి అవకాశాల పెంపు ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని చేపడతున్నామని, దీని ద్వారా దేశవ్యాప్తంగా 7.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నామన్నారు.

ఇది కూడా చదవండి: పెళ్లైన వ్యక్తితో సహజీవనం..కూతుర్ని నరికి చంపిన తండ్రి.. ప్రియుడి పిటిషన్తో..!

అసోం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 4250 కోట్లు కేటాయించడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ రాష్ట్రాల్లో  మౌలిక సదుపాయాలు, జీవనోపాధి ప్రాజెక్టుల అభివృద్ధిలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందన్నారు. దీని ఫలితంగా ఆదాయ ఉత్పత్తి పెరుగుతుందని మంత్రి తెలిపారు. తమిళనాడులోని మరక్కనం నుండి పుదుచ్చేరి వరకు నాలుగు లేన్ల హైవేలను నిర్మించడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు వైష్ణవ్ తెలిపారు. ఈ హైవే  ప్రాజెక్టును మొత్తం రూ.2,157 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు అశ్వినీకుమార్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత కారిడార్‌లో నెలకొన్న రద్దీని తగ్గిస్తుందని, చెన్నై, పుదుచ్చేరి విలుప్పురం, నాగపట్నం వంటి అభివృద్ధి చెందుతున్న పట్టణాల మొబిలిటీ అవసరాలను తీరుస్తుందని మంత్రి అశ్వినీకుమార్ వివరించారు.

ఇది కూడా చదవండి:తెలంగాణ రైతులకు శుభవార్త.. కొత్త పాస్‌బుక్ వచ్చిన వారందరికీ ఈ నెలలో రైతు బీమా

Advertisment
తాజా కథనాలు