/rtv/media/media_files/2025/08/03/china-tightens-leash-on-foreign-travel-for-govt-employees-2025-08-03-20-30-26.jpg)
China tightens leash on foreign travel for govt employees
చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను విదేశాలకు వెళ్లనీయడం లేదు. ఉపాధ్యాయులు, డాక్టర్లు అలాగే ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్లని బయటి దేశాలకు వెళ్లకుండా ఆంక్షలు విధిస్తోంది. తమ ప్రజల్లో సైద్ధాంతిక భావాలు అనే దారి మళ్లకుండా ఉండటం కోసం, విదేశీ ప్రభావాలను అరికట్టేందుకు, దేశ భద్రతను పెంపొందించడం కోసం చైనా ఈ చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది.
Also Read: హమాస్ భూగర్భ సొరంగంలో ఇజ్రాయెల్ బందీ.. తిండి లేక, బక్క చిక్కిన శరీరంతో దీన స్థితి
చైనా విధించిన ఆంక్షలు చూసుకంటే.. ప్రభుత్వం రంగంలో పనిచేసే ఉద్యోగులు తమ పాస్‌పోర్ట్‌ను స్థానిక అధికారులకు ఇచ్చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత ప్రయాణాలు చేయాల్సి వస్తే తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలి. వ్యక్తిగత సెలవులను కూడా యాజమాన్యాలు లేదా స్థానిక ప్రభుత్వ విభాగాలే ఆమోదించాల్సి ఉంటుంది. కానీ చాలావరకు విదేశీ పర్యటనలకు ఇవి పర్మిషన్లు ఇవ్వడం లేదు. అంతేకాదు చైనా పౌరులు ఒకవేళ విదేశాల్లో చదువుకుంటే వాళ్లని కొన్ని ప్రభుత్వ పదవులకు కూడా అనర్హులుగా ప్రకటించింది.
కారణం ఇదే
చైనాలోని అధికార కమ్యూనిస్ట్ పార్టీ తమ ప్రజలపై విదేశీ సైద్ధాంతిక ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాజకీయ క్రమశిక్షణతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు విస్తృత ప్రచారాలు చేస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు అమలు చేస్తోంది. విదేశాల్లో ఉండే ఉద్యోగుల వ్యక్తిగత, కుటుంబ సంబంధాలను కాడ అధికారులు మ్యాపింగ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనా అమలుచేస్తోన్న ఈ ఆంక్షలు ఆ దేశ శ్రామిక శక్తిలో విస్తృత భాగాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
చైనాలో పట్టణ, స్థానిక సంస్థల్లో 16.7 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్లందరిపై ఈ ఆంక్షలు ప్రభావం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే పదవీ విరమణ పొందినవాళ్లు కూడా తమ పాస్‌పోర్టులు తిరిగి పొందడం కోసం రెండేళ్ల పాటు ఎదురుచూడాల్సి వస్తోంది. మరికొంతమంది ఉద్యోగులను వారి సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని.. తమ నివాస నగరాన్ని విడిచివెళ్లేటప్పుడు రిపోర్ట్ చేయాలని కూడా అడగటం గమనార్హం.
Also Read: రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్ డ్రోన్లు.. చమురు, ఆయుధ నిల్వలపై దాడులు
గతంలో ఈ ఆంక్షలు అనేవి కేవలం ఉన్నతాధికారులకు లేదా, సున్నితమైన సమాచారానికి సంబంధించి పనిచేసేవాళ్లపై మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిధిని ప్రభుత్వం విస్తరించేసింది. సాధారణ ప్రభుత్వ ఉద్యోగులైన పాఠశాల ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, నర్సులతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే సాధారణ సిబ్బందికి సైతం ఈ రూల్స్ వరిస్తున్నాయి. చైనా పెట్టిన ఈ ఆంక్షల వల్ల విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాఉండగా చైనా వీదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నా కూడా భారతీయుల కోసం మాత్రం వీసా నిబంధనలను సులభతరం చేస్తోంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు యత్నిస్తోంది.