Agentic AI: ఉద్యోగస్తులకు బిగ్ షాక్.. ఏజెంటిక్‌ ఏఐతో ఈ రంగాల వారి జాబ్‌లు ఔట్.. 1.8 కోట్ల ఉద్యోగాలు గల్లంతు!

ఏజెంటిక్ కృతిమ మేధ వల్ల తయారీ, రిటెయిల్, విద్య వంటి రంగాల్లో భారీగా ఉద్యోగాలకు ముప్పు ఉందని ఇటీవల సర్వీస్‌నౌ నివేదిక తెలిపింది. 2030 నాటికి ఈ మూడు రంగాల్లో కలిపి దాదాపు 1.8 కోట్ల ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని ఈ నివేదిక అంచనా వేసింది.

New Update
AI

AI

ప్రస్తుతం కృత్రిమ మేధస్సు ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. ఇప్పటికే ఐటీ రంగంలో ఎందరో ఉద్యోగాలు తొలగిపోయాయి. మనుషులు చేయాల్సిన వర్క్ అంతా కూడా ఏఐ చేస్తుంటే ఇంకా వీళ్లతో పనేంటి అని కంపెనీలు ఉద్యోగస్థులను తొలగిస్తోంది. అయితే ఏజెంటిక్ కృతిమ మేధ వల్ల తయారీ, రిటెయిల్, విద్య వంటి రంగాల్లో భారీగా ఉద్యోగాలకు ముప్పు ఉందని ఇటీవల సర్వీస్‌నౌ నివేదిక తెలిపింది. 2030 నాటికి ఈ మూడు రంగాల్లో కలిపి దాదాపు 1.8 కోట్ల ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని ఈ నివేదిక అంచనా వేసింది. ఎక్కువగా తయారీ రంగంలో 80 లక్షల మంది ఉద్యోగాలపై ప్రభావం పడనుందని తెలిపింది. అదే రిటెయిల్‌ రంగలో 76 లక్షల మంది, విద్యా రంగంలో 25 లక్షలకు మందికిపైగా ఉన్నవారి ఉద్యోగాలపై ప్రభావం పడనుందని ఈ నివేదిక వెల్లడించింది. 

ఇది కూడా చూడండి:Meta AI: తమ కంపెనీకి రావాలని రూ.8,750 కోట్లు ఆఫర్‌ చేసిన మెటా.. తిరస్కరించిన ఉద్యోగి

ఈ మూడు రంగాల వారికే..

చిన్న వర్క్‌లు, క్లర్క్, ఛేంజ్ మేనేజర్లు వంటి ఉద్యోగాలను ఏఐ ఏజెంట్లు ఈజీగా చేయగలవు. వీటిలో కొన్ని ఉద్యోగాలకు మాత్రమే మానవ సాయం కావాలి. ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ వంటి హై-ఆగ్మెంటేషన్ ఉద్యోగాలు మాత్రం ఏఐతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు కూడా ఇలానే ఉన్నాయి. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ అయిన టీసీఎస్ కంపెనీలో 12 వేల మంది ఉద్యోగులను తొలగించింది. మైక్రోసాఫ్ట్ ఇలా ఎన్నో సంస్థలు కంపెనీలో ఏళ్ల నుంచి చేస్తున్న వారిని కూడా తొలగించింది. దీంతో అన్ని రంగాల ఉద్యోగస్థులు కూడా భయపడుతున్నారు.

ఏఐ వల్ల ఉద్యోగాలు తొలగిపోవడమే కాదు.. కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. 2030 నాటికి ఏఐ 30 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తుందని సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ అండ్ బిజినెస సెంటర్ ఎండీ సుమీత్ మాథుర్ తెలిపారు. అలాగే ఏఐ దేశ కంపెనీలు ఎలా వాడుతున్నాయని సర్వీస్‌నౌ 500కు పైగా కంపెనీలతో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో 13.5 శాతం కంపెనీలు ఏఐ టెక్నాలజీ కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. అలాగే భారతీయ సంస్థలకు డేటా భద్రతా సమస్యలు ఉన్నాయి. వీటిని కూడా పరిష్కరించడానికి ఏఐ వినియోగించేలా చేస్తున్నారని తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Japan Miracle: జపాన్ అద్భుత సృష్టి.. సెకన్‌కు 150 జీబీ డేటా డౌన్‌లోడ్.. 1.02 పెటాబిట్స్ స్పీడ్!

Advertisment
తాజా కథనాలు