/rtv/media/media_files/2025/03/21/mySZOpoyVcJpEV97KmU2.jpg)
CM Siddaramaiah responds on Honeytrap in Assembly
పాక్, భారత్ ఉద్రిక్త పరిస్థితిలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. పహల్గామ్ ఉగ్రదాడిపై ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై యుద్ధం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. మేం యుద్ధానికి అనుకూలం కాదు. శాంతి ఉండాలి. ప్రజలు సురక్షితంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అన్నారు. అయితే.. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. సిద్ధ రామయ్య పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.
Also Read : పాకిస్తాన్‌లో ఈ నగరాలే భారత్ టార్గెట్.. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిడి!
BJP Leader Calls Siddaramaiah A Pakistani Ratna
Karnataka CM Siddaramaiah says, There’s no need to go to war with Pakistan, we should maintain peace.
— Akshay Akki ಅಕ್ಷಯ್🇮🇳 (@FollowAkshay1) April 26, 2025
Peace..? With a country that sponsors terrorism and kills our own peoplem..?
What a joke🤡#PahalgamTerroristAttack pic.twitter.com/g906cpBILe
అంతేకాదు ఆయన వ్యాఖ్యలను జియో న్యూస్‌తో సహా పాకిస్థాన్ మీడియా కవర్ చేశాయి. భారతదేశంలో యుద్ధానికి వ్యతిరేకంగా స్వరాలు అన్న హెడ్డింగ్‌తో వార్తలు ప్రసారం చేశాయి. దీంతో సిద్ధరామయ్యపై విమర్శలు వెల్లువెత్తాయి. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గురించి ప్రస్తావిస్తూ విజయేంద్ర మాట్లాడుతూ.. పాకిస్తాన్‌కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై సంతకం చేసినందుకు నెహ్రూతో పాకిస్తాన్ చాలా సంతోషంగా ఉంది. కాబట్టి రావల్పిండి వీధుల్లో నెహ్రూను ఓపెన్ జీపులో తీసుకెళ్లారు. పాకిస్తాన్‌లో ఓపెన్ జీపులో తిప్పబడే భారతదేశ తదుపరి రాజకీయ నాయకుడు సిద్ధరామయ్య అవుతారా అని ఎద్దేవా చేశారు.
Also read: కాంగ్రెస్ వాళ్లను ఉరికిచ్చి కొడతా... ఎర్రబెల్లి దయాకర్ రావు ఫుల్ ఫైర్
Siddha is aiming for Pakistani Ratna award🤬 https://t.co/rAZ8ofTbPq
— Dipak Pujari (@PujariDipak) April 27, 2025
Also Read : Ruhani Sharma రెచ్చిపోయిన రుహానీ.. బ్లాక్ అండ్ వైట్‌లో అందాల సెగలు
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆయనపై ఫైర్ అయ్యారు. సిద్దరామయ్యకు సరిహద్దుల నుంచి పెద్ద చీర్స్! పాకిస్థానీ మీడియా సిద్దరామయ్యను ప్రశంసించిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. పాక్ మీడియా వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. ఆ పార్టీ నాయకులు సిద్ధరామయ్యను పాకిస్తాన్ రత్న అని అభివర్ణించారు. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప విమర్శలు గుప్పించారు. మనం ఐక్యంగా నిలబడాల్సిన సమయంలో, సిద్ధరామయ్య మాటలు తీవ్రంగా భాదాకరంగా ఉన్నాయి. చిన్నపిల్లాడిలా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి, దేశం అంతా కలిసి నిలబడి ఉన్నప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని విమర్శించారు.
(CM Siddaramiah | karnataka-cm-siddaramaiah | due to pahalgam attack | pakistan | pakisthan ratna)