/rtv/media/media_files/2025/04/27/ciiLNIVLXzO5TADzq9Hb.jpg)
Mehbooba Mufti
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భద్రతా బలగాలు రంగలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురి ఉగ్రవాదుల ఇళ్లు కూడా నేలమట్టం చేశాయి. అయితే ఈ వ్యవహారంపై తాజాగా జమ్మూశ్మీర్ మాజీ సీఎం,పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత మెహబూబా ముఫ్తీ ఎక్స్ వేదికగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా లక్ష్యంతో కూడిన విధానాన్ని అనుసరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్ చేసిన వీడియోగ్రాఫర్.. కానీ
Mehbooba Mufti Calls For Restraint In Pahalgam
సామూహిక అరెస్టులు చేయడం, ఇళ్లను కూల్చివేయడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పౌరులపై విచక్షణారహితంగా చర్యలు తీసుకుంటే చివరికీ ఇది ఉగ్రవాదుల గ్రూపులకే మరింత బలం చేకూరుతుందని తెలిపారు. '' కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఉగ్రవాదులెవరో ? పౌరులెవరో ? వీటి భేదాలను జాగ్రత్తగా గుర్తించాలి. అమయాకులను, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే వాళ్లను వేరు చేయకూడదు.
Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
వేలాదిమందిని అరెస్టు చేస్తున్నరని.. తీవ్రవాదుల ఇళ్లతో పాటు సాధారణ కశ్మీర్ ప్రజల ఇళ్లు కూల్చేస్తున్నారనే నివేదికలు వస్తున్నాయి. ఇలాంటి చర్యలు తీసుకోవడం అంటే అమాయకులను శిక్షించమే. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆధారాలో కూడిన చర్యలు చేపట్టాలి. పౌరులకు గౌరవం ఇవ్వాలి. పౌరులపై విచక్షణారహితంగా చర్యలు తీసుకుంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న మన పోరాటాన్ని ఇది దిగజారుస్తుంది. భద్రతా దళాలు మానవ హక్కులను రక్షణ కల్పించేలా ఉండే కచ్చితత్వమైన ఆపరేషన్‌పై ఫోకస్ పెట్టాలి. సామూహిక శిక్ష అనే ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసి.. తీవ్రవాద ప్రచారానికి దారి తీస్తుంది. న్యాయం, విశ్వాసం అనేవే ఉగ్రవాదంపై పోరాడే బలమైన ఆయుధాలని'' మెహబూబా ముఫ్తీ అన్నారు.
Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు
Also Read : ముంబై ఖాతాలో మరో ఘన విజయం.. లక్నో చిత్తు చిత్తు
telugu-news | rtv-news | Pahalgam attack | jammu-kashmir | mehbooba-mufti