Hydrogen Bomb: ప్రపంచానికి మరో విధ్వంసాన్ని పరిచయం చేసిన చైనా

చైనా హైడ్రోజన్ బాంబు పరీక్షించింది. ఇది పేలితే 1000 డిగ్రీల ఉష్ణోగ్రత విడుదల అవుతుంది. 2కిలోల మెగ్నీషియం హైడ్రైడ్‌‌తో చైనా షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 705 రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ హైడ్రోజన్‌ బాంబు టెస్ట్ చేసినట్లు తెలిపింది.

New Update
Hydrogen bomb

భయంకరమైన కరోనా వైరస్ ప్రపంచానికి పరియచం చేసిన చైనా మరో ప్రమాదంపై ప్రయోగాలు చేస్తోంది. అణ్వస్త్రాల తరహాలో కాకుండా సాధారణ బాంబుల్లోనే అత్యధిక విధ్వంసం సృష్టించగల హైడ్రోజన్‌ బాంబును చైనా విజయవంతంగా పరీక్షించింది. ఇది పేలితే కొన్ని సెకన్లపాటు 1000 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత వెదజల్లుతుంది. ఈ బాంబు సృష్టించే వినాషనం అంతా ఇంతా కాదు. చైనా షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 705 రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ హైడ్రోజన్‌ బాంబు టెస్ట్ చేసినట్లు తెలిపింది. 2 కిలోల మెగ్నీషియం హైడ్రైడ్‌ వినియోగించిన పేలుడు పరికరాన్ని.. నియంత్రిత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించినట్టు వెల్లడించింది. పేలుడు సమయంలో 2 సెకన్ల పాటు 1000 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత ఏర్పడింది. దీని ప్రభావం (ట్రై నైట్రో టోలిన్‌)టీఎన్‌టీ పేలుడు కంటే 15 రెట్లు ఎక్కువని వివరించింది. 

Also Read :  ఆల్‌టైమ్ రికార్డ్.. లక్ష దాటిన బంగారం ధర

China Hydrogen Bomb

అణు బాంబుల పేలుడు వల్ల తీవ్రతతోపాటు తర్వాత రేడియేషన్‌ కారణంగా ఏర్పడే దుష్పరిమాణాలు చాలానే ఉన్నాయి. దీంతో అణ్వస్త్రాల తరహాలో తీవ్ర విధ్వంసం సృష్టిస్తూనే.. తర్వాత కాలంలో ప్రభావం చేపని బాంబుల తయారీపై అగ్రరాజ్యాలు ఫోకస్ పెట్టాయి. రష్యా, అమెరికాలు ఇప్పటికే ఈ తరహా బాంబులను రూపొందించాయి. తాజాగా చైనా ఆ తరహా బాంబును టెస్ట్ చేసింది.

Also Read :  మాయ లేడీ.. అండర్‌వేర్స్ ఎలా చోరీ చేసిందో చూశారా? - ‘కి’లేడీ మామూల్ది కాదు భయ్యా!

ఈ బాంబులతో తీవ్రమైన విధ్వంసం జరగడమే కాదు అల్యూమినియం అల్లాయ్‌ వంటి లోహాలు కరిగి, రక్షణ పరికరాలు, సామగ్రి దెబ్బతింటాయని చెబుతున్నారు. హైడ్రోజన్‌తో ఆక్సిజన్‌ కలిసినప్పుడు రసాయన చర్య జరిగి నీరుగా మారుతుంది. ఈ క్రమంలో తీవ్రఉష్ణం వెలువడుతుంది. హైడ్రోజన్‌కు ఉన్న ఈ లక్షణం ఆధారంగా చైనా బాంబు తయారీ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కువ హైడ్రోజన్‌ ఒకచోట కావాలంటే దాన్ని తీవ్ర ఒత్తిడితో ట్యాంకులో నింపాల్సి ఉంటుంది. అలా బాంబు తయారు చేయడం కష్టం. ఈ క్రమంలోనే చైనా శాస్త్రవేత్తలు మెగ్నీషియం హైడ్రైడ్‌ పొడిని పేలుడు పదార్థంగా వాడి.. బాంబు తయారు చేశారు. ఈ బాంబు పేలగానే మెగ్నీషియం హైడ్రైడ్‌ పొడి వెదజల్లబడుతుంది.

Also read: Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ఇలానే.. తర్వాత పోప్ ఎవరు?

పేలుడు సమయంలో ఏర్పడే వేడికి కొంత మెగ్నీషియం హైడ్రైడ్‌ విడిపోయి హైడ్రోజన్‌ వాయువు వెలువడుతుంది. అది మండి మరింత వేడి ఉత్పత్తి అవుతుంది. ఈ వేడికి మరింత మెగ్నీషియం హైడ్రైడ్‌ విడిపోయి.. హైడ్రోజన్‌ వెలువడటం, అది మండిపోయి మరింత వేడిని విడుదల చేయడం ఇవన్నీ దశల వారిగా జరుగుతాయి. ఈ క్రమంలో పేలుడు పదార్థమంతా మండిపోయేవరకు కొన్ని సెకన్ల పాటు వెయ్యి డిగ్రీల సెల్సియ్‌సకుపైగా ఉష్ణోగ్రత తీవ్ర విధ్వంసం సృష్టిస్తుంది. దీంతో అల్యూమినియం అల్లాయ్‌ వంటి లోహాలు కరిగిపోతాయి. దానితో రూపొందించే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇతర రక్షణ పరికరాలు తీవ్రంగా దెబ్బతింటాయి. నిజానికి మెగ్నీషియం హైడ్రైడ్‌ను వివిధ రంగాల్లో శక్తి ఉత్పాదన కోసం వినియోగించేందుకు అభివృద్ధి చేశారు. ఈ పదార్థాన్ని వేడి చేసినప్పుడు హైడ్రోజన్‌ను విడుదల చేస్తుంది. దాన్ని ఇంధనంగా వినియోగిస్తారు.

Also read: TS High Court: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని రమేష్

 

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | international news in telugu

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు