China: కండోమ్‌ల పేరుతో.. 63 హోటళ్లను మోసం చేసిన యువకుడు..

చైనాకి చెందిన ఓ యువకుడు కాలేజీ అడ్మిషన్ కోసం ఏకంగా 63 హోటళ్లను మోసం చేశాడు. హోటల్ గదుల్లో బొద్దింకలు, మురికి కండోమ్‌లు ఉన్నాయంటూ.. వారిని బ్లాక్ మెయిల్ చేసి నష్టపరిహారం తీసుకున్నాడు. చివరకిి హోటల్ సిబ్బంది మోసాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Hotels
New Update

హోటళ్లలో బస చేసి వారి సర్వీసులు బాలేదని డబ్బులు పరిహారంగా తీసుకున్న ఘటన చైనాలో చోటుచేసుకుంది. కాలేజీ అడ్మిషన్ కోసం డబ్బులు లేకపోవడంతో ఓ యువకుడు ఏకంగా 63 హోటళ్లలను మోసం చేశాడు. జియాంగ్ అనే 21 ఏళ్ల యువకుడు హోటళ్లకు వెళ్లేవాడు. అక్కడ గదుల్లో బొద్దింక, విరిగిన జుట్టు, కండోమ్‌లు వంటివి పడేసేవాడు.

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

కొన్ని నెలల నుంచి..

వీటిని వీడియో తీసి హోటల్ యాజమాన్యానికి చూపించి ఫిర్యాదు చేస్తానని, వైరల్ చేస్తానని బెదిరించేవాడు. ఉచితంగా స్టే లేదా నష్ట పరిహారం ఇవ్వాలని లేకపోతే సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని వారిని మోసం చేశాడు. ఇలా మొత్తం 63 హోటళ్లను మోసం చేసి డబ్బు కాజేసుకున్నాడు. ఇలా కొన్ని నెలల నుంచి హోటళ్లలో ఉంటూ మోసం చేస్తున్నాడు. చివరికి ఓ హోటల్‌లో కూడా ఇలా చేస్తుంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది.

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

ఈ హోట్‌లో పనిచేస్తున్న సిబ్బంది.. గతంలో ఓ హోటల్‌లో పనిచేస్తున్నప్పుడు కూడా ఇదే ఘటన జరిగింది. దీంతో ఆ సిబ్బంది హోటల్ యాజమాన్యానికి తెలపగా.. ఆ యువకుడు బ్యాగ్ అన్ని చెక్ చేశారు. దీంతో అతని బ్యాగ్‌లో మురికి కండోమ్‌లు, బొద్దింకలు అన్ని కనిపించాయి. దీంతో ఆ హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

చైనాలో వేర్వేరు ప్రదేశాల్లో గత కొన్ని రోజుల నుంచి హోటళ్లను బ్లాక్ మెయిల్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు జియాంగ్‌ను అరెస్ట్ చేశారు. అలాగే హోటళ్లను మోసం చేసి కాజేసిన డబ్బు రూ.4.3 లక్షలను పోలీసులు సేకరించారు. 

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

#china #condom #college-students #blackmail #hotels
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe