నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

నాగచైతన్య, శోభిత డిసెంబర్ 4 న మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. వీరి మధ్య 6 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు.

New Update
chai 22

అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4 న ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా వారి పెళ్లి జరగనుంది ఇప్పటికే అక్కినేని వారి ఇంట పెళ్లి పనులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ డిస్కషన్ నడుస్తోంది. 

Also Read: జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

ఆరేళ్ళ ఏజ్ గ్యాప్..

అది కూడా వీళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి కావడం గమనార్హం. నాగ చైతన్య నవంబర్ 23, 1986లో జన్మించాడు. అతని వయసు 38 ఏళ్లు కాగా, 1992 మే 31న జన్మించిన శోభితా ధూళిపాళకు 32 ఏళ్లు. వీరిద్దరి మధ్య 6 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. కొందరేమో ప్రేమకు వయసుతో సంబంధం లేదంటూ అభిప్రాయ పడుతున్నారు. 

నాగచైతన్య-శోభితల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా పెళ్లి జరగనుంది. డిసెంబరు 4న రాత్రి 8.13 నిమిషాలకు వారిద్దరూ ఒకటి కానున్నారు. ఈ పెళ్ళికి కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు మొత్తం 300 మందిని ఆహ్వానిస్తున్నట్లు నాగ్‌ ఇప్పటికే ప్రకటించారు. తెలుగు సాంప్రదాయ పద్ధతిలోనే వీరి పెళ్లి జరగనుంది.

Also Read: నన్ను అరెస్టు చేయాలని చూస్తే.. RGV షాకింగ్ ట్వీట్

Advertisment
Advertisment
తాజా కథనాలు