Salwan Momika: ఖురాన్‌ను తగలబెట్టిన క్రైస్తవుడు ఖతం.. కోర్టు విచారణకు ముందే కాల్చివేత!

ఖురాన్‌ను తగలబెట్టిన ఇరాక్ క్రిస్టియన్ సాల్వన్ మోమికా కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో గురువారం స్టాక్‌హోమ్ కోర్టుకు హాజరు కావాల్సివుండగా బుధవారం అతని ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. దీంతో ఈ కేసు తీర్పు ఫిబ్రవరి 3కు కోర్టు వాయిదా వేసింది.

New Update
Salwan Momika

Salwan Momika

Salwan Momika:ఖురాన్‌(Quran)ను పలుమార్లు తగలబెట్టి వివాదంలో చిక్కుకున్న ఇరాక్ క్రిస్టియన్ సాల్వన్ మోమికా కాల్చి చంపబడ్డాడు. గుర్తు తెలియని వ్యక్తులు మోమికా ఇంట్లోనే కాల్చి చంపేశారు. 2023లో టిక్ టాక్‌ వేదికగా ఖురాన్‌ను కాల్చేస్తూ హల్ చల్ చేసిన మోమికాపై ఇస్లాం దేశాలు తీవ్రంగా మండిపడుతూ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది.

మత విద్వేషాలను రెచ్చగొడుతూ..

సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాడనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాల్వన్ కేసును గురువారం న్యాయస్థానం తీర్పు వెలువరించాల్సి ఉంది. కానీ సాల్వన్ మరణ వార్త తెలియగానే స్టాక్‌హోమ్ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఇక స్వీడన్‌లోని మసీదు ముందు ఖురాన్‌ను తగులబెట్టిన ఘటనలో సల్వాన్ మోమికాతోపాటు మరొక వ్యక్తి సల్వాన్ నజీమ్ కూడా ఉన్నాడు. స్వీడిష్ కోర్టులో అతను కూడా హాజరుకావాల్సివుంది. వీరిద్దరు ముస్లిం మతంపై ద్వేషాన్ని వ్యాప్తి చేశారనే ఆరోపణలున్నాయి. ఈ ఇద్దరు వ్యక్తులు స్టాక్‌హోమ్ మసీదు వెలుపల ఖురాన్‌ను తగలబెట్టి, ముస్లిం మతంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ తీర్పును ఫిబ్రవరి 3కు న్యాయస్థానం వాయిదా వేసింది.

Also Read: Japan: స్నానం చేయొద్దు, బట్టలు ఉతకొద్దు ప్లీజ్.. పౌరులకు జపాన్ సర్కార్ రిక్వెస్ట్.. ఎందుకో తెలుసా?

ఖురాన్‌ను ఎందుకు తగులబెట్టాడు?

ఇరాకీ క్రిస్టియన్ అయిన సాల్వన్ మోమికా స్వీడన్‌లోని సోడర్టల్జీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇస్లాంకు వ్యతిరేకంగా నిరసన చేశాడు. ఈ క్రమంలోనే ఖురాన్‌ను కాల్చడానికి అనుమతి ఇవ్వాలని పలుసార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. అయితే స్వీడిష్ పోలీసులు ఒక రోజు మాత్రమే ఇస్లాంకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి అనుమతి ఇచ్చారు. దీతో 2023లో ఖురాన్‌ను కాల్చడానికి ఆమోదం పొందిన తర్వాతే తాము ఖురాన్ కాపీని కాల్చబోతున్నామని టిక్ టాక్ లో ప్రకటించాడు మోమికా. 'స్వీడన్ ఇంకా మేల్కొలపడానికి సమయం ఆసన్నమైందని మేము చెప్పాలనుకుంటున్నాం. ఇది ప్రజాస్వామ్యం. మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు.. కానీ వారి ఆలోచనలు, విశ్వాసాలకు వ్యతిరేకం. ముస్లిం మతం చాలా ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంది. దీనిని ప్రపంచవ్యాప్తంగా నిషేధించాలి' అని మోమికా వీడియోలో పేర్కొన్నాడు. 

Also Read: Thandel Censor Report: తండేల్ సెన్సార్ కంప్లీట్.. సినిమా రన్ టైమ్ ఎంతంటే?

Also Read: జూ.ఎన్టీఆర్ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్!

Advertisment
తాజా కథనాలు