/rtv/media/media_files/2025/11/01/billionaires-who-went-to-the-restaurant-2025-11-01-11-14-53.jpg)
Billionaires who went to the restaurant
Billionaires: ప్రపంచంలోని బిలియనీర్లు ఒకచోట కలిస్తే ఎలా ఉంటుంది. సందడే కదా? అలానే జరిగింది. ప్రపంచం లోని అత్యంత సంపన్నులైన ముగ్గురు సీఈవోలు ఓ రెస్టారెంట్ కు డిన్నర్‌కు వెళ్లారు. వారిని చూసి హోటల్ యజమాన్యంతో పాటు కస్టమర్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రపంచ కుబేరులైన ముగ్గురు దిగ్గజాలు తమ హోటల్‌కు రావడంతో వారు ఉబ్బితబ్బిబ్బయారు. అంతేకాదు అక్కడ ఉన్న కస్టమర్లైతే ఎగిరి గంతేశారు. ఎందుకంటే అక్కడి వారి బిల్లులు అన్ని కూడా బిలియనీర్లే చెల్లించి.. అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. ఇంతకీ ఆ బిలియనీర్లు ఎవరో తెలుసా? ఎన్విడియా (Nvidia) సీఈవో జెన్సన్ హువాంగ్, శాంసంగ్ ఛైర్మన్ లీ జే యాంగ్ , హ్యుందాయ్ ఛైర్మన్ చుంగ్ యుయి-సన్‌లు. వారు డిన్నర్‌కు వెళ్లిన రెస్టారెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read : అమెరికాలో భారత సంతతి వ్యక్తి బ్లాక్ రాక్ స్కామ్..500 మిలియన్ల టోకరా
Billionaires Went To Dinner
People who watch this video may not believe it. 😂
— Tsla Chan (@Tslachan) October 30, 2025
These characters are Jensen Huang, Lee Jae-yong, and Jeong Eui-sun.
Yes, they are the CEO of Nvidia, Samsung, and Hyundai, respectively. pic.twitter.com/kMNI0KUVT1
వీరంతా దక్షిణ కొరియా లోని జియోంగ్జులో జరుగుతున్న ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు అక్కడికి వచ్చారు. ఈ క్రమంలో సియోల్‌లో అత్యంత ఫేమస్ అయిన క్యాన్‌బు చికెన్ రెస్టారెంట్‌కు వెళ్లారు. బిలియనీర్లను చూసిన వారంతా ఆనందంతో వారితో ఫోటోలు దిగెందుకు ఆసక్తి చూపారు. వీరిని చూసేందుకు అక్కడివారంతా పోటీ పడ్డారు.. బిలియనీర్లను ఫోటోలు తీసేందుకు పలువురు ఫొటోగ్రాఫర్లు ఎగ పడ్డారు.ఈ సందర్భంగా వారు చీజ్ బాల్స్, చీజ్ స్టిక్స్, బోన్‌లెస్ చికెన్, ఫ్రైడ్ చికెన్‌లతో పాటు మరికొన్ని డ్రింక్‌లను తీసుకున్నారు. వీరి రాకతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ క్రమంలో హువాంగ్ బమటకు వచ్చి తమను చూసేందుకు వచ్చిన ప్రజలకు పంచిపెట్టారు. తరువాత అక్కడ ఉన్న వారితో బిలియనీర్లు ముచ్చటించారు. అనంతరం వారికి ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు. రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయే ముందు హువాంగ్ హోటల్ యజమానులకు పలు బహుమతులు కూడా అందజేశారు. ఈ క్రమంలో రెస్టారెంట్‌లోని కస్టమర్లందరి బిల్లులను తామే చెల్లిస్తామని హువాంగ్ ప్రకటించారు. దీంతో అక్కడివారంతా ఆశ్చర్యపోయారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. వీరి డిన్నర్ డేట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read:Pakistan: నీటికొరతతో పాకిస్తాన్ పాట్లు..సింధునది జలాలు లేక తీవ్ర నష్టం
Follow Us