CM Revanth-KTR Arrest: కేటీఆర్ కు జైలు ఇప్పట్లో లేనట్లే.. ఢిల్లీ టూర్‌లో సీఎం రేవంత్ సంచలన ప్రకటన!

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ పై పరోక్షంగా స్పందించారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. తనకు ఎవరినీ అర్జెంటుగా జైలుకు పంపించాలనే ఆలోచన లేదన్నారు.

New Update
CM Revanth Reddy Over KTR Arrest

CM Revanth Reddy Over KTR Arrest

ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్తారన్న ప్రచారం చాలా రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే. దీపావళికి రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సైతం స్వయంగా ప్రకటించారు. దీంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ ఉంటుందనే ప్రచారం ఆ సమయంలో జోరుగా సాగింది. ఈ వ్యవహారంలో ఏసీబీ కేటీఆర్ ను విచారణకు సైతం పిలిచింది. అయితే అరెస్ట్ చేయలేదు. పక్కాగా ప్రూఫ్స్ సేకరించిన తర్వాతే కేటీఆర్ అరెస్ట్ ఉంటుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఈ రోజు ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ పై పరోక్షంగా స్పందించారు. ఈ రోజు మీడియా చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. తనకు ఎవరినీ అర్జెంటుగా జైలుకు పంపించాలనే ఆలోచన లేదన్నారు. దీంతో కేటీఆర్ అరెస్ట్ ఇప్పట్లో ఉండదనే అంశం స్పష్టమైంది.  

మంత్రి వర్గ విస్తరణ లేనట్లే..

తెలంగాణ కేబినెట్ విస్తరణ లేనట్లేనని సీఎం రేవంత్ సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీలో మీడియా చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గంలో తీసివేతలు, కూడికలపై హైకమాండ్ దే నిర్ణయమని తేల్చి చెప్పారు. తనకు ఉన్న అవకాశం మేరకు అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పనిచేస్తున్నానన్నారు. కుల గణన ఆషామాషీగా చేసింది కాదన్నారు.

ఎంతో పకడ్బందీగా చేశామన్నారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని.. ఈరోజు లేదా రేపు ప్రకటన ఉంటుందని తెలిపారు. తాను రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోరలేదన్నారు. తనకు రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ లేదని స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు