/rtv/media/media_files/2026/02/02/balochistan-liberation-army-releases-photos-of-two-female-suicide-attackers-2026-02-02-17-07-11.jpg)
Balochistan Liberation Army releases photos of two female suicide attackers
తమకు స్వాతంత్ర్యం కావాలని పాకిస్థాన్(pakistan) లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఇద్దరు బలూచ్ మహిళల వీర మరణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 'ఆపరేషన్ హెరోఫ్'ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో గ్వాదర్ ఫ్రంట్‌లో పాకిస్థాన్ భద్రతా బలగాలపై ఇద్దరు బలూచ్ మహిళలు పోరాటం చేశారు.
Also Read: రూ.85 లక్షల విలువైన బంగారు నగలిచ్చి మోమోలు తిన్న బాలుడు
BLA Releases Photos Of Two Female Suicide Attackers
ఈ పోరాటంలో వీళ్లిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోరాటానికి ముందు వాళ్లలో ఓ మహిళ బలూచ్ ప్రజలకు సందేశం ఇచ్చారు. '' బలూచిస్తాన్ జాతి ప్రజలరా ఈరోజు మీ సోదరీమణుల్లో ఒకరు పంజాబీ సైన్యాన్ని ఎదుర్కొంటున్నారు. మీరు ధైర్యంతో ముందుకు రండి. మనకు వేరే మార్గాలు లేవు. తమను ఎదుర్కొనేందుకు పాక్ సైన్యం భయంతో ముందుకు రావడం లేదు. మనల్ని పాక్ ఎదుర్కోలేదని'' అన్నారు. ఆ వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి యుద్ధం ఎలా ఉందని అడిగాడు. ఇది సరదాగా ఉందంటూ ఆమె సమాధానం ఇచ్చింది. గ్వాదర్ ఫ్రంట్ దగ్గర్లో పాక్ భద్రతా సిబ్బందిని తమ టీమ్ హతమార్చిందంటూ పేర్కొంది.
🚨🔴Balochistan Liberation Army releases photos of two female suicide attackers after deadly Pakistan attack. pic.twitter.com/OuZb2tsyt2
— THE UNKNOWN MAN (@Theunk5555) February 2, 2026
Baloch Liberation Army Video:
— Aditya Raj Kaul (@AdityaRajKaul) February 2, 2026
“During Operation Herof, Phase Two at the Gwadar Front, Fidayee Hawa Baloch fought selflessly, shoulder to shoulder with fellow Fidayeen. This was her final message, sent twelve hours before her martyrdom.” pic.twitter.com/tedajNIjkD
ఆ వీడియోలో మాట్లాడిన మహిళను హవా బలూచ్‌గా గుర్తించారు. ఆమె తండ్రి 2021లో పాకిస్థాన్ భద్రతా బలగాల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈయన కూడా BLA నాయకుడే. అయితే తాజాగా జరిగిన దాడుల్లో శుక్రవారం 41 మంది, శనివారం 92 మంది వేర్పాటువాదులు మరణించినట్లు పాక్ సైన్యం తెలిపింది.
Also Read: 4 AM బిర్యానీ తింటున్నారా? అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే...
Follow Us