Naga Babu Re Entry: తెలుగు బుల్లితెరపై నవ్వులకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన జబర్దస్త్ షో ప్రారంభమైన 12 ఏళ్ళు పూర్తి చేసుకొని700 ఎపిసోడ్‌ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. జబర్దస్త్ మొదట్లో ఉన్న చాలా మంది టీమ్ లీడర్లు చమ్మక్ చంద్ర, అదిరే అభి, హైపర్ ఆది, ధన్‌రాజ్, గెటప్ శ్రీను ఈవెంట్ లో సందడి చేశారు.
నాగబాబు రీ ఎంట్రీ
ఇది మాత్రమే కాదు షోకు మొదటి నుంచి జడ్జ్ గా ఉన్న నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చాలా కాలం తర్వాత నాగబాబు తిరిగి జబర్దస్త్ స్టేజ్ పై అడుగుపెట్టడంతో అభిమానుల్లో ఆనందం వెల్లువిరిసింది. నాగబాబును చూసి అక్కడున్న కమెడియన్లు, ప్రేక్షకులు సంతోషంతో కేరింతలు కొట్టారు.
2013 నుంచి దాదాపు పదేళ్ల పాటు జబర్దస్థ్ జడ్జ్ గా తనదైన శైలిలో పంచ్ లు, ప్రాసలతో అలరించారు నాగబాబు. 2021లో జబర్దస్త్ నుంచి తప్పుకొని రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ప్రస్తుతం జనసేన పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ.. ఆంద్రప్రదేశ్ ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో నాగబాబు మళ్ళీ జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన మళ్ళీ బుల్లితెర పై కనిపిస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే కేవలం స్పెషల్ ఎపిసోడ్ కోసం మాత్రమే వచ్చారా? లేదా పర్మనెంట్ జడ్జ్ గా వచ్చారా? అనేది సస్పెన్స్!
Also Read: Bahubali: శివగామితో బాహుబలి, భల్లాలదేవ.. పదేళ్ల బాహుబలి ముచ్చట్లు! ఫొటోలు చూశారా