/rtv/media/media_files/2025/08/22/thailand-2025-08-22-16-15-48.jpg)
Thailand
విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ దేశంలో పర్యాటక రంగాన్ని, అలాగే కొన్ని ప్రదేశాలను అభివద్ధి చేయడానికి దేశీయ విమాన ప్రయాణాన్ని ఉచితంగా కల్పించనుంది. ఎక్కువ మంది విదేశీ పర్యాటకులు థాయ్‌లాండ్‌లో ఉన్న పుకెట్, బ్యాంకాక్‌లో ఉన్న ప్రదేశాలను చూడటానికి వెళ్తున్నారని ప్రభుత్వం గ్రహించింది. మిగిలిన ప్రదేశాలు కూడా చూసేలా తమ దేశంలో ఉచిత విమాన ప్రయాణం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో "బై ఇంటర్నేషనల్, ఫ్రీ థాయ్‌లాండ్ డొమెస్టిక్ ఫ్లైట్స్" అనే పథకం పేరుతో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పథకం ద్వారా భారత దేశం నుంచి కానీ వేరే దేశం నుంచి వచ్చే పర్యాటకులు అన్ని ప్రదేశాలను సందర్శిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆఫర్ కింద దేశీయ విమానాల్లో ప్రయాణించే వారికి వన్ వే టికెట్ ధర 1750 బాత్ అవుతుంది. రౌండ్ ట్రిప్స్ అయితే 3500 బాత్ అవుతుంది. వీటిని ప్రభుత్వమే ఇవ్వాలని భావిస్తోంది. అయితే ఈ ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్యలో ఈ బంపర్ ఆఫర్‌పే థాయ్‌లాండ్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Income Tax Bill 2025: కేంద్రం సంచలన నిర్ణయం.. ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరణ !
#Thailand plans to offer Free Domestic Flights to 200,000 International Arrivals under the campaign name
— Backpacking Daku (@outofofficedaku) August 22, 2025
“Buy International, Free Thailand Domestic Flights”
Focus: Promote secondary destinations, UNESCO sites, and major tourist cities.
Duration: September to November,…
20 కిలోల లగేజీని ఉచితంగా..
ఈ పథకం కింద విదేశీ పర్యాటకులు థాయ్‌లాండ్‌కు స్టాండర్డ్ అంతర్జాతీయ విమాన టిక్కెట్లు కొనుగోలు చేసిన తర్వాత తీసుకోవాలి. అది కూడా ఎయిర్‌లైన్ వెబ్‌సైట్‌లు, మల్టీ సిటీ ఆప్షన్స్, ఫ్లైత్రూ సర్వీసెస్, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ ఉచిత ప్రయాణ ఆఫర్ ఈజీగా పొందవచ్చు. అయితే ప్రతి పర్యాటకుడు రెండు దేశీయ విమాన టిక్కెట్లను పొందవచ్చు మరియు 20 కిలోల లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఈ ఆఫర్‌తో దాదాపుగా 2 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులను రప్పించాలనే లక్ష్యంగా థాయ్‌లాండ్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకం వల్ల థాయ్‌లాండ్ ప్రభుత్వానికి 21.80 బిలియన్ బాత్ వరకు ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేసింది. దీనివల్ల పర్యాటకులు కొత్త ప్రదేశాలను కూడా చూస్తారని భావిస్తోంది.
భారతీయులకు దీనివల్ల ప్రయోజనం ఏంటి?
ఈ పథకం వల్ల భారతీయులు తక్కువ బడ్జెట్‌లో థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో ఉన్న అన్ని ప్రదేశాలను వీక్షించి రావచ్చు. ఉదాహరణకు, భారతీయ పర్యాటకులు బ్యాంకాక్‌లో దిగి, అక్కడి నుండి చియాంగ్ మై, చియాంగ్ రాయ్ లేదా క్రాబి వంటి ప్రదేశాలకు ఉచిత విమాన ప్రయాణం చేయవచ్చు. దీనివల్ల ఖర్చు తక్కువగా కావడంతో అన్ని ప్రదేశాలను సందర్శిస్తారు.
థాయ్‌లాండ్‌కు ఈ పథకం వల్ల లాభమేంటి?
కోవిడ్ 19 వల్ల థాయ్‌లాండ్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది. మళ్లీ తిరిగి పుంజుకోవాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అన్ని ప్రాంతాలను పర్యాటకులు చూస్తారు. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ఇతర చిన్న వ్యాపారాలకు బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.
ఇది కూడా చూడండి: Best Saving Schemes for Women: లెస్ రిస్క్.. మోర్ సోవింగ్.. 60 ఏళ్ల మహిళలకు బెస్ట్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఇవే!