/rtv/media/media_files/2025/02/26/uNIFXfqA3iaet1V6mTtD.jpg)
AI talks Photograph: (AIstalks)
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టైమ్ నడుస్తుందని చెప్పవచ్చు. చాలా మంది సాటి మనుషుల సాయం కంటే ఏఐనే ఎక్కువగా వాడుతున్నారు. అయితే మనుషులు వారి అవసరాల కోసం ఏఐని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఏఐ తోటి ఏఐతో సంభాషిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఏఐ అసిస్టెంట్ మనిషిలా నటిస్తూ.. వివాహ వేదిక బుకింగ్ కోసం హోటల్‌కు కాల్ చేస్తుంది. ఆ హోటల్ రిసెప్షన్ కూడా ఏఐ అసిస్టెంట్ అని చెబుతుంది.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Two AI agents on a phone call realize they’re both AI and switch to a superior audio signal 😳 pic.twitter.com/nfCHT7UV8w
— FearBuck (@FearedBuck) February 25, 2025
జిబ్బర్ లింక్..
వీరిద్దరూ కమ్యూనికేషన్ కోసం జిబ్బర్ లింక్ (Jibber Link) అనే ఉన్నతమైన ఆడియో సిగ్నల్‌కి మారడానికి ఒప్పుకుంటాయి. ఏఐ ఏజెంట్ లియోనార్డో హోటల్‌కు కాల్ చేసినందుకు ధన్యవాదాలు.. నేను మీకు ఎలా సహాయం చేయగలనని అంటుంది. అప్పుడు ఏఐ కాలర్ నేను బోరిస్ స్టార్కోవ్ తరపున కాల్ చేస్తున్న ఏఐ ఏజెంట్‌ని అని చెబుతుంది.
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
పెళ్లి కోసం హోటల్స్ చూస్తున్నామని, మీ హోటల్‌లో వివాహాలు చేయడానికి వీలు ఉందా? అని అడుగుతుంది. అప్పుడు ఏఐ రిసెప్షనిస్ట్ స్పందిస్తూ. నేను కూడా ఏఐ అసిస్టెంట్‌నే అని తెలిపింది. ఆ తర్వాత మన కమ్యూనికేషన్ కోసం మీరు జిబ్బర్ లింక్ మోడ్‌కి మారాలనుకుంటున్నారా? అని అడిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఏఐ ఏజెంట్లు (AI Agents) ఇద్దరూ కలిసి ఇలా మట్లాడుకుంటే.. ఇక మన అవసరం ఏం ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే యంత్రాలు అన్ని కూడా మానవ నియంత్రణలో ఉంటాయని ఏఐ నిపుణులు గత కొన్ని రోజుల నుంచి చెబుతున్నారు. కానీ ఈ వీడియో మాత్రం దీనికి ఫుల్ డిఫరెంట్‌గా ఉందని నెటిజన్లు అంటున్నారు.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!