National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

బీజేపీ ప్రభుత్వంపై సీపీఎం తన వైఖరిని మార్చుకుంది. మోదీని, బీజేపీ మాతృసంస్థ RSSను నియో-ఫాసిస్టుగా పరిగణించట్లేదని ప్రకటించింది. వామపక్ష పార్టీలకు భిన్నంగా ప్రకటన చేయడంపై సీపీఐ, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ మాత్రం స్వాగతించింది.

New Update
cpm bjp

CPM declares not consider neo-fascists Modi, BJP, RSS

National: బీజేపీ ప్రభుత్వంపై సీపీఎం తన వైఖరిని మార్చుకుంది. మోదీ ప్రభుత్వం నిరంకుశత్వ జాతీయవాద శక్తి అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడే సీపీఎం.. ఇప్పుడు తన వాయిస్ భిన్నంగా వినిపిస్తోంది. మోదీ ప్రభుత్వంపై ఫాసిస్టు ముద్ర వేసేందుకు నిరాకరించడం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వామపక్ష పార్టీలకు భిన్నంగా మోదీ ప్రభుత్వంపై సీపీఎం చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

Also Read: బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

ఫాసిస్టుగా పరిగణించలేం..

మోదీని, బీజేపీ మాతృసంస్థ RSSను నియో-ఫాసిస్టుగా పరిగణించట్లేదని ప్రకటించింది. మోదీ సర్కార్‌కు నయా-ఫాసిస్టు పోకడలు ఉన్నాయని పార్టీ ముసాయిదా తీర్మానంలో అంగీకరిస్తూనే.. ఫాసిస్టు ప్రభుత్వమని మాత్రం పరిగణించలేమని తేల్చేసింది. బీజేపీ పదేళ్ల నిరంతర పాలన తర్వాత, బీజేపీ-RSS చేతుల్లో రాజకీయ అధికారం ఏకీకృతం అయిందని మాత్రమే చెబుతోంది. దీని ఫలితంగా బీజేపీలో నియో-ఫాసిస్ట్ లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని సీపీఎం అంటోంది.  

Also Read: మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

రహస్య స్నేహం బట్టబయలు..

సీపీఎం ప్రకటనపై సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మార్క్సిస్ట్ పార్టీ ఏళ్ల తరబడి బీజేపీతో సాగిస్తున్న రహస్య స్నేహం బట్టబయలైందని కాంగ్రెస్‌ ఆరోపించింది. కేరళ ఎన్నికల వేళ బీజేపీతో సీపీఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందని మండిపడింది. అటు సీపీఎం తన తీర్మానాన్ని సవరించుకోవాలని సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి వినయ్‌ విశ్వం డిమాండ్‌ చేశారు. ఫాసిస్ట్‌ భావజాలం, మతం, విశ్వాసాన్ని రాజకీయ లాభం కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు చెబుతుందని.. బీజేపీ ప్రభుత్వం వీటన్నింటినీ ఆచరణలో పెట్టిందని మండిపడ్డారు.  

ఇది కూడా చదవండి: నాగబాబు ఫిక్స్.. వర్మకు డౌట్.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే! !

మరోవైపు తమిళనాడులోని మదురైలో ఏప్రిల్‌ 24న సీపీఎం పార్టీ, కాంగ్రెస్‌  సంయుక్త సమావేశం జరుగనుంది. ఈ సమావేశాల్లో ఆమోదించే విశ్లేషణాత్మక రాజకీయ తీర్మానం ముసాయిదాను.. కేంద్ర కమిటీ ఇటీవలే రాష్ట్ర కమిటీలకు చర్చ కోసం పంపింది. మోదీ సర్కార్‌ను సీపీఐ ఫాసిస్టు ప్రభుత్వంగా పేర్కొనకపోవడంతో భారత్‌లోకి ఫాసిజం వచ్చేసిందని సీపీఐ-ఎంఎల్‌ అంటోంది. అయితే ఈ రెండు పార్టీలకు తన వైఖరి భిన్నమని సీపీఎం తన ముసాయిదాలో పేర్కొంది. ఇక సీపీఎం ప్రకటనను బీజేపీ స్వాగతించింది. ఈ ప్రకటనతో కాంగ్రెస్‌ కుట్రలు కనుమరుగవ్వనున్నాయని చెప్పింది. సీపీఎం ఆలస్యంగానైనా నిజాన్ని గ్రహించిందని సంతోషం వ్యక్తం చేసింది బీజేపీ. గతంలో బీజేపీని ఫాసిస్ట్‌గా వర్ణించిన సీపీఎం.. ఇప్పుడు అలా చెప్పలేమంటూ అనడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇది కూడా చదవండి: మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు