/rtv/media/media_files/2025/02/26/L1I1o6ExSULFNs4xxZMu.jpg)
Aadi pinishetty divorce
Aadi Pinishetty Divorce: హీరో ఆదిపినిశెట్టి ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వైవాహిక జీవితం, కెరీర్ కి సంబంధించిన విషయాలను గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన భార్య నిక్కీ గల్రానీతో విడిపోతున్నారు అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. వారు ఎలాంటి విడాకులు తీసుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. విడాకుల వార్తలు చూసి తాను చాలా బాధపడినట్లు తెలిపారు. అలాంటి అవాస్తవాలు రాసేవారిపై కోపం వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Maha Shivratri 2025: జాగారం చేసేవారు ఈ సినిమాలు చూడండి.. శివనామస్మరణలో మునిగిపోతారు
విడాకులపై ఆది క్లారిటీ
ఆది మాట్లాడుతూ.. నిక్కీ పెళ్ళికి ముందు నాకు మంచి స్నేహితురాలు. అలా మా కుటుంబ సభ్యులకు కూడా ఎంతో చేరువైంది. నిక్కీతో నేను సంతోషంగా ఉంటాననిపించింది. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాం. సంతోషముగా జీవితం కొనసాగిస్తున్నాం. సడెన్ గా మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఫస్ట్ షాకయ్యను.. బాగా కోపం వచ్చింది. కానీ ఆ ఖాతాల్లోని మరికొన్ని వీడియోలు చూశాక ఇలాంటి వారిని పట్టించుకోకపోవడం మంచిదనిపించింది. వాళ్ళు క్లిక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమైంది అంటూ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు ఆది.
Also Read: Sankranthiki Vasthunam: 'సంక్రాంతికి వస్తున్నాం' ఫ్యాన్స్ కి అనిల్ రావిపూడి మరో బంపర్ సర్‌ప్రైజ్
/rtv/media/media_files/2025/02/26/wBWWz0T7l3QSmLsRVf1l.png)
చాలా గ్యాప్ తర్వాత ఆది 'శబ్దం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 28న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కాబోతుంది. హర్రర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీని అరివళగన్ వెంకటాచలం తెరకెక్కించారు. లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా, రాజీవ్ మీనన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా థ్రిల్లింగ్ అంశాలతో సినిమా పై ఆసక్తిని పెంచింది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Also Read: Fight Obesity: రజినీకాంత్, చిరు, మమ్ముట్టిని నామినేట్ చేసిన మోహన్ లాల్.. ఎందుకంటే?
Follow Us