K Visa : అమెరికాకు చైనా బిగ్‌షాక్

అమెరికాకు చైనా బిగ్‌షాక్ ఇచ్చింది. H1B వీసాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో..చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశీ నిపుణుల కోసం చైనా కొత్త ప్లాన్‌ కు శ్రీకారం చుట్టింది. అమెరికా H1B వీసా మాదిరిగా 'కే-వీసా' విధానాన్ని తీసుకురానుంది

New Update
china

అమెరికాకు చైనా(America-China) బిగ్‌షాక్ ఇచ్చింది. H1B వీసా(h1b visa) పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో..చైనా వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. విదేశీ నిపుణుల కోసం చైనా కొత్త ప్లాన్‌ కు శ్రీకారం చుట్టింది. అమెరికా H1B వీసా మాదిరిగా 'కే-వీసా' విధానాన్ని తీసుకురానుంది. H-1B వీసా గందరగోళం మధ్య, ప్రపంచ నైపుణ్యాలను ఆకర్షించడానికి అక్టోబర్ 1 నుండి చైనా కొత్త కే-వీసాపై దృష్టి సారిస్తోంది.  విదేశీ ప్రతిభను తమ దేశానికి ఆకర్షించడానికి చైనా ప్రభుత్వం అక్టోబర్ 1 నుండి  కే-వీసా అనే కొత్త వీసా పథకాన్ని ప్రారంభించనుంది.  

Also Read : Mahbubnagar : పిండ ప్రదానం చేసి వెళ్తుండగా.. 5 నెలల గర్భవతితో పాటుగా

 Also Read :  నేను చనిపోతున్నాను.. సెలవిక... తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని సంచలన లేఖ

స్పాన్సర్‌షిప్ లేకుండానే వీసా

స్థానిక కంపెనీ స్పాన్సర్‌షిప్ లేకుండానే వీసా పొందే అవకాశం ఉంది.  అమెరికాలో H-1B వీసా పొందడానికి ప్రయత్నిస్తున్న చాలామంది భారతీయ నిపుణులు, విద్యార్థులకు ఈ K వీసా(K Visa) ఒక కొత్త అవకాశంగా మారవచ్చు అని నిపుణులు భావిస్తు్న్నారు.  దీన్ని US H-1B వీసాకు పోటీగా అభివర్ణిస్తున్నారు నిపుణులు. వీసా ఫీజును US లక్ష డాలర్లకు పెంచడం చైనాకు కలిసొచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

Also Read : Hyderabad: మేడ్చల్‌లో దారుణం.. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్‌ విద్యార్థి సూసైడ్

చైనా లేదా విదేశాలలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు లేదా పరిశోధనా సంస్థల నుండి STEM రంగాలలో బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ డిగ్రీతో పట్టభద్రులయిన వారు ఈ కే-వీసాకు ధరఖాస్తు చేసుకోవచ్చు.  అలాగే అలాంటి సంస్థల్లో బోధన, పరిశోధనలో నిమగ్నమైన యువ నిపుణులు కూడా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. చైనాలో ప్రస్తుతం ఉన్న 12 సాధారణ వీసా వర్గాలతో పోలిస్తే, K వీసా చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఎక్కువ రోజుల కాలపరిమితి, ఎక్కువ సార్లు స్వదేశాలకు రాకపోకలు సాగించే వెసులుబాటు, రెన్యూవల్‌ సదుపాయం వంటి మరిన్ని ఫీచర్లను కే–వీసాకు జోడించారు.

కాగా అమెరికా H-1B దరఖాస్తులపై 100,000 డాలర్ల వార్షిక రుసుమును భారీగా విధించింది, ఇది ఐటీ సేవా సంస్థలలో ఆందోళనను రేకెత్తించింది. దీంతో  భారతీయ టెక్ నిపుణులు, ఐటీ కంపెనీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. 

Also Read :  Also read : IND vs PAK : మీరు మాట్లాడండి, మేము గెలుస్తాం.. ట్వీట్లతో పాక్ పరువు తీసిన ఇండియన్ ఓపెనర్లు!

Advertisment
తాజా కథనాలు