Hyderabad: మేడ్చల్‌లో దారుణం.. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్‌ విద్యార్థి సూసైడ్

ర్యాగింగ్ భూతానికి విద్యార్థులు బలి అవుతున్న సంఘటనలు చాలా చూస్తునే ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. సీనియర్ విద్యార్థులు తమ అధికారాన్ని చూపించుకోవడానికి కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుంటారు.

New Update
btech

ర్యాగింగ్(Raging) భూతానికి విద్యార్థులు బలి అవుతున్న సంఘటనలు చాలా చూస్తునే ఉన్నాం. ఇది చాలా దురదృష్టకరం. సీనియర్ విద్యార్థులు తమ అధికారాన్ని చూపించుకోవడానికి కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇది ఆత్మహత్య(Suicide) లకు కూడా దారి తీస్తోంది.కాలేజీ యాజమాన్యం ర్యాగింగ్‌ను అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ర్యాగింగ్ కు బలవుతున్న విద్యార్థుల గురించి తరుచుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.  తాజాగా ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్ధి బలయ్యాడు.

Also Read :  మరోసారి బాంబు పేల్చిన కవిత.. హరీశ్‌ రావుకు బిగ్ షాక్‌

సీనియర్ల వేధింపుల తట్టుకోలేక

హైదరాబాద్‌(Hyderabad) మేడ్చల్‌లో దారుణం జరిగింది. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్‌ విద్యార్థి(BTech Student) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన సాయితేజ సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చసువుతున్నాడు. సీనియర్ల టార్చర్ తట్టుకోలేక హాస్టల్‌లో ఉరేసుకుని జాదవ్ సాయితేజ చనిపోయాడు. సీనియర్లు బలవంతంగా మద్యం తాగించారంటూ సెల్పీ వీడియోలో తెలిపాడు. బార్‌కు తీసుకెళ్లి ఫుల్‌గా తాగి...రూ. 10వేల బిల్లు కట్టాలని ఒత్తిడి చేశారంటూ సాయితేజ చివరి వీడియోలో తెలిపాడు. 

సీనియర్ల టార్చర్‌తోనే సాయితేజ చనిపోయాడని స్నేహితుల ఆరోపిస్తున్నారు.  సాయితేజ మృతితో అతని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  తమ కుమారుడి మరణానికి కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమేనని అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. 

Also Read :  నేను చనిపోతున్నాను.. సెలవిక... తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని సంచలన లేఖ

Advertisment
తాజా కథనాలు