Telangana: ఫిబ్రవరిలో తెలంగాణ అంతటా ఏడు రోజులు సెలవులు.. తేదీలు ఇవే!

వచ్చే నెల ఫిబ్రవరిలో తెలంగాణ అంతటా బ్యాంకులు కొన్ని రోజులు మూతపడనున్నాయి. మొత్తం ఏడు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. వాటిల్లో ఫిబ్రవరి 2,9,16,23 నాలుగు ఆదివారాలు, 8, 22 రెండు శనివారాలు, 26 మహాశివరాత్రి ఉన్నాయి. ఇలా మొత్తం 7రోజులు సెలవులు రానున్నాయి.

New Update
Telangana banks holidays in February.

Telangana banks holidays in February


2025 ఏడాది ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. అయితే ఆ సంవత్సరం రావడమే కాదు.. మొదటి నెల కూడా అయిపోవస్తుంది. మరో మూడు రోజుల్లో జనవరి నెల కంప్లీట్ కానుంది. ఈ నెలలో చాలా సెలవులే వచ్చాయి. స్కూళ్లు, కాలేజీలు సహా బ్యాంకులకు పండగ మొదలు, ఆదివారాలతో కలిపి చాలా సెలవులే వచ్చాయి. 

మరి తొలి నెల అయిపోతుండగా.. రెండో నెల వచ్చేస్తుంది. దీంతో ఫిబ్రవరిలో ఎన్ని రోజులు సెలవులు వచ్చాయో తెలిసిపోయింది. అయితే ఇక్కడే ట్విస్టు ఆ సెలవులు స్కూళ్లు, కాలేజీలకు కాదండోయ్ కేవలం బ్యాంకులకు మాత్రమే. అవును మీరు విన్నది నిజమే. తెలంగాణ అంతటా 2025, ఫిబ్రవరిలో బ్యాంకులకు ఏడు రోజులు సెలవులు వచ్చాయి. 

ఇది కూడా చూడండి:Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

తెలంగాణలో ఈ ఏడు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. వాటిల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం ఒకటి, నాలుగో శనివారం ఒకటి, మహాశివరాత్రి మరొకటి ఉన్నాయి. ఇప్పుడు ఆ తేదీల గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

ఇది కూడా చూడండి:Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

ఈ తేదీల్లో సెలవులు

ఆదివారాలు: ఫిబ్రవరి 2, 9, 16, 23
 రెండో శనివారం: ఫిబ్రవరి 8
నాలుగో శనివారం: ఫిబ్రవరి 22
మహాశివరాత్రి: ఫిబ్రవరి 26 

అయితే తెలంగాణలో ఈ ఏడు రోజులు బ్యాంకులు బంద్ కానున్నప్పటికీ మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సర్వీసులు రోజు వారీలాగానే పనిచేస్తాయి. అయితే కొన్ని సేవలకు బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. అలాంటి వారు ముందుగానే ఈ సమాచారాన్ని తెలుసుకోవడం ద్వారా బ్యాంకులకు వెళ్లి నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఏవైనా పనులు ఉంటే ముందుగానే చేసుకునే అవకాశం ఉంటుంది. 

Advertisment