TG high court: 16 ఏళ్ల లోపు పిల్లలను ఆ సమయంలో థియేటర్లకు అనుమతించొద్దు: హైకోర్టు
సినిమా థియేటర్లకు 16 ఏళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11 నుంచి ఉదయం 11 గంటల వరకు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఆదేశించింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
16ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే సమయ వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 16ఏళ్ల లోపు పిల్లలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు థియేటర్లలోకి అనుమతించకూడదని అధికారులను ఆదేశించింది.
ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేశారు.
వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను న్యాయస్థానం ఏకీభవించింది. అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.

TG high court

ఇది కూడా చూడండి: UCC: ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి..ఎప్పటి నుంచి అమలు అంటే
ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చూడండి: Donald Trump: ఇజ్రాయెల్ కి మళ్లీ బాంబులు..బైడెన్ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!
పిల్లల ఆరోగ్యంపై ప్రభావం
వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను న్యాయస్థానం ఏకీభవించింది. అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.
ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్ ఈటర్ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!