/rtv/media/media_files/2026/01/27/airports-across-asia-reintroduce-health-checks-following-nipah-virus-outbreak-in-india-2026-01-27-15-58-04.jpg)
Airports across Asia reintroduce health checks following Nipah virus outbreak in India
భారత్‌లో నిపా వైరల్(nipah-virus) మరోసారి కలకలం రేపుతోంది. పశ్చిమ బెంగాల్(west bengal) లో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో దాదాపు 100 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. అలాగే ఆసియాలో పలు ఎయిర్‌పోర్టులకు హై అలెర్ట్ జారీ చేశారు. కోవిడ్ తరహా ఆరోగ్య తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వాళ్లలో ఒకరి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తున్నామని ఆరోగ్య అధికారులు తెలిపారు.
Also Read: శోభనం రాత్రే తండ్రైన పెళ్లికొడుకు.. షాక్ అయిన బందువులు!
Airports Across Asia Reintroduce Health Checks Following Nipah Virus
థాయిలాండ్, నేపాల్, తైవాన్‌తో పాటు వివిధ దేశాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే ప్రయాణికులను ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో చైనీస్ న్యూఇయర్ ప్రారంభం కానుంది. దీంతో ఈ వైరస్ వ్యాప్తిపై మరింత ఆందోళన నెలకొంది. ఇదిలాఉండగా నిపా వైరస్ అనేది గబ్బిలాలు, పందులు లాంటి జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. అలాగే మనుషుల నుంచి మనుషులకు కూడా సామాజిక సంబంధాల ద్వారా సోకుతుంది.
Also Read: ఇక ఇండియాని ఎవరూ ఆపలేరు.. 18ఏళ్ల చర్చలు నేడు పట్టాలెక్కనున్నాయ్!
నిపా వైరస్ అనేది ప్రాణాంతకమైన అంటువ్యాధి. ఈ వైరస్ సోకినవాళ్లలో మరణాల రేటు 45 నుంచి 75 శాతం వరకు ఉంటుంది. జ్వరం, శ్వాసకోశ సమస్యలు, తలనొప్పి, మెదడువాపు, మూర్ఛలు, కోమా లాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు గుర్తించడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇంక్యుబేషన్ వ్యవధి 4 నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. పలు సందర్భాల్లో అయితే 45 రోజుల దాకా ఉంటుంది. ఈ వైరస్ నుంచి ప్రాణాలతో బయటపడ్డవాళ్లు మూర్ఛ లేదా వ్యక్తిత్వ మార్పులు లాంటి దీర్ఘకాలిక నాడీ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది.
Follow Us