Mother of all deals: ఇక ఇండియాని ఎవరూ ఆపలేరు.. 18ఏళ్ల చర్చలు నేడు పట్టాలెక్కనున్నాయ్!

భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఒప్పందాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, యూరోపియన్ ప్రతినిధులు 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు.

New Update
Mother of all deals

అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలో ఈరోజు నూతన అధ్యాయం లిఖించబడనుంది. భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య దాదాపు 18 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఈ ఒప్పందాన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, యూరోపియన్ ప్రతినిధులు 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా అభివర్ణించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు (జనవరి 27, 2026) న్యూఢిల్లీలో జరగనున్న భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో వెలువడనుంది. 2007లో ప్రారంభమైన ఈ చర్చలు అనేక కారణాల వల్ల 2013లో నిలిచిపోయాయి. తిరిగి 2022లో సంప్రదింపులు తిరిగి ప్రారంభమై.. చివరి దశకు చేరాయి. దీంతో ఇక ఇండియా డెవలప్‌మెంట్‌ను ఆపలేరు. వాణిజ్యంలో భారత్ దూసుకుపోతుంది. యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లీయన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా సుమారు 200 కోట్ల మంది ప్రజలతో కూడిన భారీ మార్కెట్ ఏర్పడనుంది, ఈ డీల్ ప్రపంచ జీడీపీలో దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉంటుంది.

ఈ చారిత్రక ఒప్పందంలోని 10 ప్రధాన అంశాలు 

భారీ మార్కెట్ యాక్సెస్: ఈ ఒప్పందం ద్వారా భారత్, 27 యూరోపియన్ దేశాల మధ్య సుమారు 200 కోట్ల మంది వినియోగదారులతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య మండలి ఏర్పడనుంది.

రక్షణ రంగ భాగస్వామ్యం: మొదటిసారిగా భారత్-ఈయూ మధ్య 'సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ పార్టనర్‌షిప్' కుదరనుంది. ఇది కేవలం అమ్మకం-కొనుగోలుకే పరిమితం కాకుండా, రక్షణ పరికరాల రెండు దేశాలు కలిసి తయారు చేయనున్నారు.

నిపుణుల వలసలు: ఇండియన్ టెక్ నిపుణులు, విద్యార్థులు, పరిశోధకులకు యూరప్‌లో ఉద్యోగ అవకాశాల కోసం ఈజీ వీసా రూల్స్ రూపొందించనున్నారు. దీని కోసం 'మొబిలిటీ ఫ్రేమ్‌వర్క్' ఒప్పందం కుదరనుంది.

సుంకాల తగ్గింపు: భారత ఎగుమతులైన జౌళి, ఫార్మా, తోలు ఉత్పత్తులపై యూరప్ సుంకాలను తగ్గించనుంది. దానికి బదులుగా  యూరప్ నుంచి వచ్చే కార్లు, వైన్, విస్కీలపై భారత్ టారిఫ్‌లను తగ్గించవచ్చు.

SAFE ప్రోగ్రామ్‌లో భారత్‌కు చోటు: యూరప్ 150 బిలియన్ యూరోల రక్షణ నిధి 'సేఫ్'లో భారతీయ రక్షణ కంపెనీలు భాగస్వాములు అయ్యే అవకాశం లభిస్తుంది.

కార్బన్ బోర్డర్ టాక్స్ పై చర్చలు: యూరప్ ప్రతిపాదించిన వివాదాస్పద కార్బన్ పన్ను విషయంలో భారతీయ స్టీల్, అల్యూమినియం ఎగుమతిదారులకు వెసులుబాటు కల్పించేలా చర్చలు జరుగుతున్నాయి.

సాంకేతిక సహకారం: సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, క్లీన్ ఎనర్జీ వంటి కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య టెక్నాలజీ షేరింగ్‌కు అంగీకరించాయి.

మేధో సంపత్తి హక్కులు: ఫార్మా రంగంలో జనరిక్ ఔషధాల సరఫరాకు ఆటంకం కలగకుండా మేధో సంపత్తి హక్కులపై స్పష్టమైన నిబంధనలు ఉండనున్నాయి.

పెట్టుబడుల రక్షణ: యూరోపియన్ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా మరింత పారదర్శకమైన, సురక్షితమైన వాతావరణాన్ని ఈ ఒప్పందం కల్పిస్తుంది.

వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి: మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, రష్యా-చైనా ప్రభావం తగ్గించి, స్వయం సమృద్ధి సాధించడంలో ఈ ఒప్పందం భారత్, ఈయూలకు రక్షణ కవచంలా నిలవనుంది.

నేడు చర్చల ముగింపుని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఈ ఒప్పందాన్ని న్యాయపరంగా పరిశీలించేందుకు మరో 5-6 నెలల సమయం పట్టవచ్చు. ఈ ఏడాది చివర్లో అధికారికంగా సంతకాలు పూర్తయి, వచ్చే ఏడాది ప్రారంభం నుండి ఇది పూర్తిస్థాయిలో అమలులోకి రానుంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత్ సాధించిన ఈ విజయం, దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల దిశగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనుంది.

Advertisment
తాజా కథనాలు