Robot Attacks Human: జనాల్ని పిచ్చి కొట్టుడు కొట్టిన రోబో.. వీడియో వైరల్!

చైనాలో ఓ ఘటన రజినీకాంత్ ‘రోబో’ సినిమాను తలపించింది. ఈవెంట్‌లో హ్యూమనాయిడ్ రోబోట్ అల్లకల్లోలం సృష్టించింది. అక్కడే ఉన్న ప్రజలపై దాడికి ప్రయత్నించింది. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని రోబోట్‌ను అదుపుచేశారు. సాఫ్ట్‌వేర్‌లో లోపంవల్లే ఇలా జరిగినట్లు తెలిసింది.

New Update
AI robot attacks crowd

AI robot attacks crowd

ఈ మధ్య కాలంలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఊహించని పురోగతి సాధిస్తుంది. అయితే దాని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. డీప్ ఫేక్, సైబర్ అటాక్ వంటివి గత కొంత కాలం నుంచి తరచూ జరుగుతూనే ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్‌గా మారాయి.

 ఇదిలా ఉంటే ప్రస్తుత కాలంలో హ్యుమనాయిడ్ రోబోలను అనేక దేశాలలో అధిక సంఖ్యలో ఉపయోగిస్తున్నారు. ఇవి చూడ్డానికి అచ్చం మనుషుల్లానే ఉంటాయి. మనుషుల్లానే పనులు చేస్తాయి. అదే సమయంలో వాటికి తిక్క రేగితే మనుషుల్లానే దాడులు చేస్తాయి. అవును మీరు విన్నది నిజమే.. దానికి ఉదాహరణ ఇటీవల చైనాలో జరిగిన ఒక సంఘటనే. 

ఇది కూడా చూడండి:Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో

రచ్చ చేసిన రోబో

చైనాలో ఇటీవల ఓ ఈవెంట్‌ నిర్వహించారు. అందులో కొన్ని రోబోట్‌లను అక్కడి కార్యకలాపాల కోసం ఏర్పాటు చేశారు. అయితే అందులో ఓ రోబోట్ చేసిన పని అందరినీ షాక్‌కి గురి చేసింది. ఏకంగా ఈవెంట్‌లో ఉన్న జనాలపై దాడికి దిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంత ఆశ్చర్యపోయారు. 

ఇది కూడా చూడండి:National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

ఆ ఘటన అచ్చం రజనీకాంత్ ‘రోబో’ సినిమాను తలపించింది. నిజ జీవితంలో ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అల్లకల్లోలంగా మారి ప్రజలతో ఘర్షణ పడటంతో అంతా ఖంగుతిన్నారు. ఆ సినిమాలోని ‘చిట్టి’ అని పిలిచే ఒక రోబోట్ ప్రజలపై ఎలా అయితే వికృతంగా దాడి చేస్తుందో.. ఇప్పుడు ఆ సన్నివేశాలను తలపించేలా ఓ రోబోట్ ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియో ప్రకారం.. రోబోట్ ప్రజల వైపు ముందుకు వెళ్లి.. వారిలో కొందరిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని హ్యూమనాయిడ్‌ను అదుపు చేశారు. అప్పుడే మరొక రోబోట్.. సమీపంలో ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించింది. అయితే రోబోట్ సాఫ్ట్‌వేర్‌లో లోపం వల్లే దాని ఆందోళనకరమైన ప్రవర్తన జరిగిందని తెలిసింది. 

ఈ వీడియో వైరల్ కావడంతో AI టెక్నాలజీ భద్రత గురించి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే ఒక రోబోట్ ఇంత ఘోరంగా ప్రవర్తిస్తుందని ఎవరూ ఊహించకపోవడంతో.. ఈ సంఘటన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. భవిష్యత్తులో అలాంటి రోబోలు మానవులకు ముప్పును కలిగిస్తాయా? అనే సందేహాలు ప్రజల్లో కలిగాయి.

Advertisment
తాజా కథనాలు